Begin typing your search above and press return to search.

వేదిక నాభి అందాలు..న‌య‌గారా జ‌ల‌పాతంలా!

`బాణం` బ్యూటీ వేదిక సుప‌రిచిత‌మే. ఆ సినిమా త‌ర్వాత అమ్మ‌డు సౌత్ లో అన్ని భాష‌ల్లో ప‌నిచేసింది గానీ..ఎక్క‌డా త‌న‌దైన మార్క్ వేసింది లేదు.

By:  Tupaki Desk   |   4 Oct 2023 12:39 PM GMT
వేదిక నాభి అందాలు..న‌య‌గారా జ‌ల‌పాతంలా!
X

`బాణం` బ్యూటీ వేదిక సుప‌రిచిత‌మే. ఆ సినిమా త‌ర్వాత అమ్మ‌డు సౌత్ లో అన్ని భాష‌ల్లో ప‌నిచేసింది గానీ..ఎక్క‌డా త‌న‌దైన మార్క్ వేసింది లేదు. అయితే న‌టిగా మాత్రం ఆమెని తీసేయ‌డానికి లేదు. ఆ సినిమా ప్లాప్ లు అమ్మ‌డిని పైకి రానివ్వ‌కుండా చేసాయి అన్న‌ది వాస్త‌వం. స‌రైన హిట్ ప‌డితే! ఏదో భాష‌లో నిల‌దొక్కుకునేది. కానీ అన్ని భాష‌ల్లోనూ అదే ప‌రిస్థితి ఎదుర‌వ్వ‌డంతో ఇక్క‌డ కాక‌పోతే అక్క‌డ‌! అని రౌండ్లు వేయాల్సి వ‌చ్చింది.

ఇక అమ్మ‌డు సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద‌గా యాక్టివ్ గా ఉండే న‌టి కాదు. అప్పుడ‌ప్ప‌డు నేను ఒక‌దాన్ని ఉన్నాను అని ట‌చ్ లోకి రావ‌డం త‌ప్ప‌! అక్క‌డా గ్లామ‌ర్ ప‌రంగా త‌న ఐడెంటిటీని చాటలేక‌పోతుంది. అయితే బ్యూటీ విష‌యంలో వేదిక త‌ర‌గ‌ని అందం అనే చెప్పాలి. ఇప్ప‌టికీ 16 ఏళ్ల ప్రాయం గ‌ల అమ్మాయిలాగే క‌నిపిస్తోంది. తాజాగా సోష‌ల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. ఇదిగో ఇక్క‌డిలా డిజైన‌ర్ దుస్తుల్లో కెమారికి వివిధ భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది.

అమ్మ‌డు మ‌రోసారి నాభి అందాలు హైలైట్ చేసింది. పాల‌నురుగ‌ల సౌంద‌ర్యం తో యువ‌త‌ని మురిపి స్తుంది. చ‌క్క‌నైన భామ చిక్క‌నే అన్న‌ట్లు నెటి జ‌నులు అమ్మ‌డి అందాన్ని ఆస్వాదిస్తున్నారు. వేదిక క‌ళ్లే అందం..ఆ చూపుతో వ‌ల‌పు బాణం విసిరితే అలా లాక్ అవ్వాల్సిందే. అమ్మ‌డి గార్జియ‌స్ లుక్ కి అంతా ఫిదా అవుతున్నారు.

ఇక వేదిక కెరీర సంగ‌తి చూస్తే 2023 లో బాగా స్పీడ‌ప్ అయిన‌ట్లే క‌నిపిస్తోంది. చేతినిండా ఫుల్లుగా సినిమా లు క‌నిపిస్తున్నాయి. సౌత్ లో అన్ని భాష‌ల్లోనూ ఒక్కో సినిమా చొప్పున చేస్తుంది. తెలుగు..త‌మిళ్ లో `జంగిల్` అనే చిత్రంలో న‌టిస్తోంది. `ర‌జాక‌ర్` అనే మ‌రో తెలుగు సినిమా కూడా చేస్తోంది. కెరీర్ ప్రారంభించి ద‌శాబ్దం దాటిన త‌ర్వాత స్పీడ‌ప్ అవ్వ‌డం అన్న‌ది విశేష‌మే.