Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : వయసు 40, అందం 18

ముద్దుగుమ్మ త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతోంది. ఇక ఇటీవలే నాలుగు పదుల వయసుకి త్రిష చేరింది.

By:  Tupaki Desk   |   1 Oct 2023 1:30 AM GMT
పిక్ టాక్ : వయసు 40, అందం 18
X

ముద్దుగుమ్మ త్రిష ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అవుతోంది. ఇక ఇటీవలే నాలుగు పదుల వయసుకి త్రిష చేరింది. అయినా కూడా త్రిష జోరు తగ్గడం లేదు. ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో అలరించింది. అంతే కాకుండా ఆకట్టుకునే అందంతో కళ్లు పెద్దవి చేసుకుని మరీ చూసేంత అందంగా కనిపించింది.

త్రిష ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది సీనియర్ ముద్దుగుమ్మలతో పోల్చితే తక్కువ వయసు ఉన్న హీరోయిన్‌ గా కనిపిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇంకా ఆ విషయం లో ఏమైనా సందేహం ఉంటే తాజాగా త్రిష షేర్‌ చేసిన ఈ సెల్ఫీని చూస్తే ఆ అనుమానం కూడా పూర్తిగా పోతుంది అంటూ ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

వైట్ టీ షర్ట్‌, టైట్ పాయింట్ లో త్రిష తీసుకున్న ఈ సెల్ఫీ ని చూస్తూ ఉంటే కాలేజ్ అమ్మాయి సెల్ఫీ లా అనిపిస్తుంది. అంతే కాకుండా 18 ఏళ్ల పడుచు అమ్మాయి మాదిరిగా త్రిష కనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. త్రిష అభిమానులు మాత్రమే కాకుండా చాలా మంది ఈ ఫోటోలను తెగ లైక్ చేస్తూ త్రిష అందంను అభినందిస్తున్నారు.

ఇంత అందంగా ఉండటం వల్లే త్రిష ఇంకా బిజీగానే ఉంది. ఆ మధ్య చిరంజీవికి జోడీగా ఒక రీమేక్‌ లో త్రిష ఎంపిక అయిందనే వార్తలు వచ్చాయి. ఆ మూవీ సంగతి ఏమో కానీ తమిళ్ లో త్రిష జోరు ముందు యంగ్‌ స్టార్‌ హీరోయిన్స్ కూడా దిగదుడుపే.

విజయ్ కి జోడీగా ఒక సినిమా లో నటిస్తూనే మరో వైపు లేడీ ఓరియంటెడ్‌ మూవీ ని చేస్తుంది. ముందు ముందు మరిన్ని కమర్షియల్ సినిమాల్లో ఈ అమ్మడు కనిపించే అవకాశాలు ఉన్నాయి. త్రిష జోరు చూస్తూ ఉంటే మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగడంతో పాటు, సోషల్ మీడియాలో అందాల విందు చేయడం కన్ఫర్మ్‌.