Begin typing your search above and press return to search.

మన్మథుడికే మతిపోగొట్టేసేలా..ఆ లుక్కేంటి పాప

అక్షర గౌడ అందాలు చూస్తే సామాన్యులకే కాదు, ఏకంగా ఆ మన్మథుడికే మతి తప్పేస్తుంది.

By:  Tupaki Desk   |   20 July 2023 12:01 PM GMT
మన్మథుడికే మతిపోగొట్టేసేలా..ఆ లుక్కేంటి పాప
X

అక్షర గౌడ అందాలు చూస్తే సామాన్యులకే కాదు, ఏకంగా ఆ మన్మథుడికే మతి తప్పేస్తుంది. చూడగానే ఆకర్షించే అందం ఆమె సొంతం. కానీ, ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలంటే అందం ఒక్కటే సరిపోదు. కూసంత అదృష్టం కూడా ఉండాలి. అయితే, అందం ఎంత ఉన్నా, అక్షర గౌడకు అదృష్టం మాత్రం కాస్త తక్కువ అనే చెప్పాలి.

సినిమాల సంగతి ఎలా ఉన్నా, ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో ఎలాంటి హద్దులు లేవనే చెప్పాలి. సోషల్ మీడియాలో తనకు నచ్చిన విధంగా ఫోటోలకు ఫోజులు ఇస్తూ, కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఓ ఫోటో షేర్ చేసింది. అందులో తన ఎద అందాలను ఎరగా వేసేసింది. మెస్సీ హెయిర్ తో పింక్ కలర్ బ్రాలో ఎద అందాలు క్లియర్ గా కనిపించేలా ఫోటోలకు ఫోజులు వ్వడం విశేషం.


ఆ ఫోజులకు ఈ వర్షాకాలంలోనూ ప్రేక్షకులకు చెమటలు పట్టేస్తున్నాయి. ఈ ఒక్క ఫోటోనే కాదు, ఆమె సోషల్ మీడియా మొత్తం సోకుల జాతరే ఉంటుంది. చూసుకున్నోడికి చూసుకున్నంత అన్నట్లుగా తన సోకులను ఆరబోస్తూ ఉంటుంది. అందుకే ఈ బ్యూటీ కి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆమెకు కేవలం ఇన్ స్టాగ్రామ్ లో 469వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

కాగా,ఈ కన్నడ అందం, టాలీవుడ్ లో సెటిల్ అవ్వాలని చాలా ప్రయత్నించింది. ఏకంగా బోల్డ్ సీన్స్ లోనూ, గ్లామర్ ఒలకపోయడంలోనూ ఎలాంటి హద్దులు పెట్టుకోలేదు. కానీ, పాపం ఎందుకో క్లిక్ అవ్వలేదు. అక్షర గౌడ కన్నడ అమ్మాయి కాగా, అన్ని ఇండస్ట్రీల్లోనూ గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది.

2011లో తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. 2019లో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. నాగార్జున మన్మథుడు సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిసింది. అందులో నాగార్జునకు ఏకంగా లిప్ లాక్ కూడా ఇచ్చింది. అప్పుడే అందరి దృష్టి ఆకర్షించింది. కానీ, ఆ మూవీ ప్లాప్ కావడం ఈ బ్యూటీ కెరీర్ పై దెబ్బ వేసింది.ఇక, ఇటీవల దాస్ కా దమ్కీ మూవీలోనూ మెరిసింది. ఈ బ్యూటీ ఇప్పటి వరకు తమిళ, కన్నడ, హిందీ, తెలుగు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం 'సూర్పనగై' తమిళ చిత్రంలో నటిస్తోంది.