Begin typing your search above and press return to search.

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

విజ‌య‌వాడ‌లో ప్ర‌ముఖంగా ఈ బెట్టింగుల ప‌ర్వం కొన‌సాగుతోంది. వంగ‌వీటి రాధా జ‌న‌సేన త‌ర‌ఫున మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు.

By:  Tupaki Desk   |   3 Nov 2026 3:34 PM IST
ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !
X

రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన స్థానిక సంస్థల ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత‌.. బెట్టింగుల ప‌ర్వానికి తెర‌దీశారు. ఈ విష‌యంలో స్థానికంగా ఉన్న నాయ‌కుల‌పైనే కాకుండా.. పార్టీల పై కూడా బెట్టింగులు జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఆకివీడు వంటి ప్రాంతాల్లో వ్య‌క్తుల కేంద్రంగా కోటి రూపాయ‌ల వ‌ర‌కు బెట్టింగులు జ‌రిగిన‌ట్టు పోలీసులు చెబుతు న్నారు. అయితే.. తెర‌వెనుక ఎవ‌రు ఉన్నార‌న్న‌ది మాత్రం ఎవ‌రూ వెల్ల‌డించ‌లేదు. ఇక‌, విశాఖ‌, విజ‌యవాడ‌, తిరుప‌తి ప్రాంతాల్లోని కార్పొరేష‌న్ల ప‌రిధిలో కూడా బెట్టింగు బాబు తెర‌మీదికి వ‌చ్చారు.

విజ‌య‌వాడ‌లో ప్ర‌ముఖంగా ఈ బెట్టింగుల ప‌ర్వం కొన‌సాగుతోంది. వంగ‌వీటి రాధా జ‌న‌సేన త‌ర‌ఫున మేయ‌ర్ అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచారు. అదేస‌య‌మంలో మాజీ ఐపీఎస్ అదికారి ఏవీ వెంక‌టేశ్వ‌ర‌రావు స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్నారు. ఇక‌, వైసీపీ త‌ర‌ఫున మాజీ మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి సైతం గ‌ట్టిపోటీ ఇచ్చార‌ని అంటున్నారు అయిన‌ప్ప‌టికీ.. వంగ‌వీటి రాధా గెలుపుపైనే ఎక్కువ‌గా బెట్టింగులు క‌ట్టార‌న్న‌ది బెజ‌వాడ టాక్‌. దీనికి ప్ర‌ధానంగా ఆయ‌నపై ఉన్న న‌మ్మ‌క‌మేన‌ని అంటున్నారు.

ఇక‌, విశాఖలో ముక్కా శ్రావ‌ణి వ‌ర్సెస్ వైసీపీ నాయ‌కురాలు, ఎమ్మెల్సీ వ‌ర‌దు క‌ల్యాణి మ‌ధ్య ఈ ఎన్నిక‌ల్లో హోరా హోరీ పోటీ జ‌రిగింద‌ని స్థానికంగా చ‌ర్చ సాగుతోంది. క‌ల్యాణి కూడా దూకుడుగానే ప్ర‌చారం చేశారు. కీల‌క‌మైన అంశాల‌ను ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు తీసుకువ‌చ్చారు. ఇక‌, కూట‌మి యావ‌త్తు.. ముక్కా శ్రావ‌ణికి అండగా నిలిచింది. చివ‌రి నిమిషంలో అంద‌రినీ ఏకం చేయ‌డ‌లో ఎంపీ శ్రీభ‌ర‌త్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రి మ‌ధ్య కూడా పోటీ ఎక్కువ‌గానే ఉంద‌ని అంటున్నారు.

అయితే.. చిత్రంగా ఓటింగ్ శాతం విజ‌య‌వాడ‌లో 55 శాతం మించ‌క‌పోగా.. విశాఖ‌లోనూ దాదాపు అదే ప‌రిస్థితి క‌నిపించింది. దీంతో పోటీ తీవ్ర‌త మ‌రింత పెరిగింద‌ని అంటున్నారు. దీంతో ఎవ‌రు గెలిచినా.. అత్యంత త‌క్కువ మెజారిటీతోనే గెలుపు గుర్రం ఎక్కే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే బెట్టింగుల‌కు మ‌రింత ఊపు వ‌చ్చింద‌ని చెబుతున్నారు. మెజారిటీ బెట్టింగు రాయుళ్లు శ్రావ‌ణికి అనుకూలంగా ఉన్నారు. ఇక‌, తిరుప‌తిలో కూడా ఇలానే బెట్టింగుల‌కు తెర‌దీశారు. మొత్తంగా వైసీపీ, టీడీపీ, జ‌నసేన‌లు బ‌లంగా ఉన్న చోట బెట్టింగులు తెర‌వెనుక బాగానే సాగుతున్నాయ‌ని తెలుస్తోంది. వంగ‌వీటిపై ఓ పారిశ్రామిక వేత్త 2 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు బెట్టింగు క‌ట్టేందుకు ముందుకు వ‌చ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.