Begin typing your search above and press return to search.

ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో వైఎస్సార్ 16వ వర్ధంతి – సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం

మెల్బోర్న్ నగరంలో శనివారం ఘనంగా జరిగిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సభ ప్రజాసేవకు మరోసారి అంకితభావాన్ని చాటింది.

By:  Tupaki Desk   |   1 Sept 2025 9:05 AM IST
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో వైఎస్సార్ 16వ వర్ధంతి – సంక్షేమం, ప్రజాసేవకు నిలువెత్తు సాక్ష్యం
X

మెల్బోర్న్ నగరంలో శనివారం ఘనంగా జరిగిన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి సభ ప్రజాసేవకు మరోసారి అంకితభావాన్ని చాటింది. కార్యక్రమంలో ఆస్ట్రేలియా వైఎస్సార్సీపీ విక్టోరియా నాయకులు నాగార్జున యలగాల, అనిల్ కుమార్ పెడగాడ, హరి చెన్నుపల్లి, సాయి కొప్పినేని, విష్ణు రెడ్డి వాకమల్ల, శ్రీధర్ రెడ్డి దురెడ్డి పాల్గొన్నారు.

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర నాయకులు , రాజ్యసభ ఎంపీ వై వి సుబ్బారెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భాగమయ్యారు.

వైఎస్సార్ పాలన ప్రజలకు ఏవిధంగా సంక్షేమం అందించిందో, ఆయన చూపిన మార్గంలోనే తన తనయుడు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తు చేశారు.

“వైఎస్సార్ చూపిన మార్గమే మాకు మార్గదర్శనం. జగన్మోహన్ రెడ్డి కూడా తన కాలంలో అదే స్థాయిలో సంక్షేమాన్ని కొనసాగించారు. వ్యవసాయం, విద్య, వైద్యంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు” అని నేతలు చెప్పారు.

“ప్రజల పక్షాన నిలబడటం, కార్యకర్తలకు అండగా ఉండటం మా కర్తవ్యం. ఎక్కడ అన్యాయం జరిగినా మనం గళమెత్తుతాం. మన పార్టీని నమ్మిన ప్రతి కుటుంబానికి రుణపడి ఉంటాం” అని వారు స్పష్టంచేశారు.

“ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటాం, కార్యకర్తలు ధైర్యంగా ముందుకు సాగాలి” అని పిలుపునిచ్చారు.