Begin typing your search above and press return to search.

యూఎస్ స్టూడెంట్ వీసా ట్రెండ్ మామూలుగా లేదుగా!

గతంతో పోలిస్తే ఈ ఏడాది యూఎస్ స్టూడెంట్ వీసాల ట్రెండ్ మామూలుగా లేదని తెలుస్తోంది. .

By:  Tupaki Desk   |   15 Aug 2023 8:26 AM GMT
యూఎస్ స్టూడెంట్ వీసా ట్రెండ్ మామూలుగా లేదుగా!
X

గతంతో పోలిస్తే ఈ ఏడాది యూఎస్ స్టూడెంట్ వీసాల ట్రెండ్ మామూలుగా లేదని తెలుస్తోంది. తాజాగా యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన తాజాగా నివేధికలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రీ పాండమిక్, ఆఫ్టర్ పాండమిక్ లెక్కలు కూడా ఘణనీయంగా మార్పును సూచిస్తున్నాయి.

అవును... యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ నుండి వచ్చిన తాజా డేటా ప్రకారం ఎఫ్-1 విద్యార్థి వీసాల జారీపై కీలక విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతంతో పోలిస్తే ఘణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. 2022లో మొత్తం 4,11,131 ఎఫ్-1 వీసాలు మంజూరు చేయబడగా.. 2019 ప్రీ-పాండమిక్ సంవత్సరంలో 3,64,204 తో పోలిస్తే ప్రస్తుత ట్రెండ్‌ లు ఈ సంఖ్యలు పెరుగుతూనే ఉంటాయని సూచిస్తున్నాయి.

ఇక 2023లో విద్యార్థులకు వీసా జారీ ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు ప్రారంభం నాటికే 3,93,000 ఎఫ్-1 వీసాలు జారీ చేయబడ్డాయి. అయితే, జారీ చేసిన వీసాల పెరుగుదలతో పాటు, తిరస్కరణ రేటు కూడా పెరిగుతుండటం గమనార్హం.

తాజాగా విడుదలైన డేటా ప్రకారం... 2022 ఆర్థిక సంవత్సరానికి 34.9% తిరస్కరణ రేటును చూపుతుండగా... అంతకు ముందు సంవత్సరంలో 19.8% రేటు కంటే ఇది చాలా ఎక్కువ. అయితే యూఎస్ జారీ చేసిన స్టూడెంట్ వీసాల్లో సుమారు 70శాతం ఆసియా విద్యార్థులు, ప్రత్యేకించి ఇండియన్స్ ఉండటం విశేషం.

హైదరాబాద్‌ లోని కొత్త యూఎస్ కాన్సులేట్ వీసా అపాయింట్మెంట్‌ ల కోసం విద్యార్థులు విస్తృతంగా ప్రయాణించాల్సిన అవసరాన్ని తగ్గించిందని చెబుతున్నారు. ఫలితంగా బ్లాక్ మార్కెట్ వీసా బుకింగ్ సేవలను తగ్గించడానికి దారితీసిందని అంటున్నారు.