ఏటా వేల కోట్ల రూపాయలు.. అమెరికా నుంచి ఎంత డబ్బు భారత్‌కు వస్తుందో తెలుసా ?
ప్రతేడాది అమెరికా నుంచి భారతీయుల ఖాతాల్లోకి కొన్న కోట్ల రూపాయలు వస్తాయి.
By: Tupaki Desk | 17 May 2025 10:00 PM ISTప్రతేడాది అమెరికా నుంచి భారతీయుల ఖాతాల్లోకి కొన్న కోట్ల రూపాయలు వస్తాయి. ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్స్ (విదేశాల నుంచి వచ్చే డబ్బు) పొందే దేశం ఇండయానే. ప్రతి సంవత్సరం ఇక్కడ 83 బిలియన్ డాలర్లు విదేశాల నుంచి వస్తుంటాయి. అందులో ఎక్కువ భాగం అమెరికా నుంచే వస్తుంది. 2023లో 129 బిలియన్ డాలర్లు వచ్చాయి. వాస్తవానికి అమెరికాలో స్థిరపడిన భారతీయులు అక్కడ పనిచేస్తూ క్రమం తప్పకుండా తమ ఇంటికి డబ్బు పంపుతూ ఉంటారు. కాబట్టి, ప్రతేడాది భారతీయుల ఖాతాల్లోకి ఎన్ని రూపాయలు వస్తాయో తెలుసా ?
ఒక్క అమెరికా నుంచే భారతదేశానికి 32 బిలియన్ డాలర్లు పంపుతున్నారు. ఇప్పుడు దీనిపై 5 శాతం పన్ను విధిస్తే సంవత్సరానికి దాదాపు 14 వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. 5శాతం పన్ను కారణంగా భారతీయ కుటుంబాలు 1.7 బిలియన్ డాలర్లు (రూ.14,000 కోట్లకు పైగా) నష్టపోవచ్చు.
అమెరికా కాంగ్రెస్‌లో ప్రతిపాదించిన ‘ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ప్రకారం.. అమెరికాలో నివసిస్తున్న అమెరికా పౌరులు కానివారు (H-1B వీసా హోల్డర్లు, గ్రీన్ కార్డ్ హోల్డర్ల వంటివారు) విదేశాలకు పంపే రెమిటెన్స్‌పై 5శాతం పన్ను విధించే ప్రతిపాదన ఉంది. ఈ చట్టం ఆమోదం పొందితే భారతీయ ప్రవాసులు ప్రతి రూ.1 లక్ష పంపడానికి రూ.5,000 అదనపు పన్ను చెల్లించవలసి ఉంటుంది.
ఈ పన్ను అమల్లోకి వస్తే భారతదేశానికి అమెరికా నుంచి వచ్చే రెమిటెన్స్ తగ్గే అవకాశం ఉంది. ఇది విదేశీ మారక నిల్వలు, దేశీయ వినియోగంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల రియల్ ఎస్టేట్, విద్య, కుటుంబ ఖర్చులపై కూడా ప్రభావం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
అమెరికాలో ఎంత మంది భారతీయులు నివసిస్తున్నారు?
విదేశాంగ మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం ప్రస్తుతం సుమారు 45 లక్షల మంది భారతీయులు అమెరికాలో నివసిస్తున్నారు. వీరిలో 32 లక్షల మంది భారతీయ సంతతికి చెందినవారు. వీరే ప్రతి సంవత్సరం తమ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు పెద్ద మొత్తంలో డబ్బును ఇంటి ఖర్చుల కోసం లేదా ఇతర అవసరాల కోసం పంపుతూ ఉంటారు. ఇప్పుడు అమెరికా ప్రతిపాదనతో ఈ వ్యక్తుల కష్టాలు పెరిగే అవకాశం ఉంది.
