Begin typing your search above and press return to search.

అమెరికాలో తెలుగు యువతి అదృశ్యం

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్న తెలుగు విద్యార్థులు తల్లిదండ్రులకు కడుపుకోతను, బంధుమితృలకు విషాదాన్ని నింపుతున్నారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 6:10 AM
అమెరికాలో తెలుగు యువతి అదృశ్యం
X

ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్తున్న తెలుగు విద్యార్థులు తల్లిదండ్రులకు కడుపుకోతను, బంధుమితృలకు విషాదాన్ని నింపుతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా, అమెరికాలలో పలు ప్రమాదాలు, కాల్పులలో తెలుగు వాళ్లు మరణించిన విషయం తరచూ వింటున్నాం. తాజాగా అమెరికాలో మరో తెలుగు యువతి అదృశ్యం అందరిలోనూ ఆందోళన రేపుతుంది.

హైదరాబాద్ నగరానికి చెందిన 23 ఏళ్ల యువతి నితిషా కందుల తాజాగా అమెరికాలో అదృశ్యమైంది.. నితీషా కందుల కాల్ స్టేట్ యూనివర్శిటీ శాన్ బెర్నార్డినోలో చదువుతోంది. ఆమె మే 28, 2024 నుంచి అమెరికాలో అదృశ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు.

కాలిఫోర్నియాలోని లాస్ ఏంజెల్స్ నుంచి నితీషా కందుల కనిపించకుండా పోయిందని, ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ పోలీసులు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు.