Begin typing your search above and press return to search.

క్యాసినోలో బెదిరింపులు... తెలుగు సంతతి విద్యార్థి అరెస్ట్!

అవును... జేబులో తుపాకీ ఉందని చెబుతూ క్యాసినోలో వృద్ధుడిని బెదిరించినందుకు తెలుగు మూలాలకు చెందిన మాస్టర్స్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు.

By:  Tupaki Desk   |   20 Dec 2023 8:16 AM GMT
క్యాసినోలో బెదిరింపులు... తెలుగు సంతతి విద్యార్థి అరెస్ట్!
X

ఇటీవల కాలంలో విదేశాల్లో తెలుగు సంతతి విద్యార్థులకు, భారతీయ విద్యార్థులకు సంబంధించిన వార్తలు కాస్త ఎక్కువగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమమో తాజాగా యూఎస్ లో మాస్టర్స్ చేస్తున్న తెలుగు సంతతికి చెందిన ఒక విద్యార్థి క్యాసినోలో ఒక వ్యక్తిని బెదిరించిన కేసులో అరెస్టయ్యాడు. దీనికి సంబంధించిన విచారణలో మరో వారం రోజుల్లో జరగనుంది.

అవును... జేబులో తుపాకీ ఉందని చెబుతూ క్యాసినోలో వృద్ధుడిని బెదిరించినందుకు తెలుగు మూలాలకు చెందిన మాస్టర్స్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే చట్టపరమైన కారణాల వల్ల అతడి పేరు, వివరాల వంటి గుర్తింపును గోప్యంగా ఉంచినట్లు చెబుతున్నారు. క్యాసినీలో ఇతడు ఎక్కువ మొత్తాన్ని కోల్పోయాడని, ఆ సమయంలోనే బెదిరింపులకు దిగాడని నివేదించబడింది.

క్యాసినో స్మోకింగ్ ఏరియాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సదరు విద్యార్థి.. తన వద్దకు వచ్చి డబ్బు డిమాండ్ చేస్తూ ఆయుధాలు కలిగి ఉన్నాడని చెప్పాడని తెలిపాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

అలా అదుపులోకి తీసుకున్న అనంతరం అతడిని విచారించగా... అతడివద్ద ఎలాంటి తుపాకీ కనిపించలేదని తెలుస్తుంది. కేవలం ఆయుధం ఉందని చెబుతూ మాత్రమే బెదిరింపులకు దిగి ఉండొచ్చని అంటున్నారు. దీనికి సంబంధించిన కోర్టు విచారణ ఈ నెల 28వ తేదీన జరగనుంది.