Begin typing your search above and press return to search.

అమెరికాలో పిడుగుపాటు... తెలుగమ్మాయి పరిస్థితి విషమం?

అవును... అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలోని లా పోర్టేలోని శాన్ జాసింటో మాన్యుమెంట్ వద్ద ఒక తెలుగమ్మాయి పిడుగుపాటుకు గురైందని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   18 July 2023 4:51 AM GMT
అమెరికాలో పిడుగుపాటు... తెలుగమ్మాయి పరిస్థితి విషమం?
X

ఈశాన్య అమెరికాలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. భారీస్థాయిలో ఉన్న ఈ పిడుగుల ఆలజడి విమాన ప్రయాణాలపై తీవ్ర ప్రభావం చూపించిందని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో... అమెరికాలోని ఒక తెలుగమ్మాయిపై పిడుగుపాటుకు గురైందని తెలుస్తుంది.

అవును... అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలోని లా పోర్టేలోని శాన్ జాసింటో మాన్యుమెంట్ వద్ద ఒక తెలుగమ్మాయి పిడుగుపాటుకు గురైందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... అమెరికాలో చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలని వెళ్లిన భారతదేశానికి చెందిన 25 ఏళ్ల తెలుగు విద్యార్థిని సుస్రూణ్య కోడూరు తీవ్రంగా గాయపడిందని అంటున్నారు.

శాన్ జాసింటో మాన్యుమెంట్ పార్క్‌ లోని లేక్ వద్ద షికారు చేయడానికి సుస్రూణ్య వెళ్లిందంట. ఈ సమయంలో పిడుగు పడడంతో సుస్రూణ్యకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. దీంతో... గాయపడిన ఆమె పక్కనే ఉన్న ఆ చెరువులో పడిపోయిందట. ఈ పరిస్థితిని గమనించిన వ్యక్తి... వెంటనే చెరువులోకి దూకి ఆమెకు సహాయం చేసి ఒడ్డుకు తీసుకొచ్చారట.

ఈ సమయంలో ఆమె గుండె కొన్ని నిమిషాల పాటు ఆగిపోవడం వల్ల మెదడు తీవ్రంగా దెబ్బ తినడంతో కోమాలోకి వెళ్లిందని వైద్యులు చెబుతున్నారంట. ఎమ్మారై రిపోర్టుల ప్రకారం ఆమెకు అనాక్సిక్ ఎన్సెఫలోపతి వచ్చిందని వైద్యులు అంటున్నారని తెలుస్తుంది. మెదడుకు ఎక్కువ కాలం ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఇలాంటి ఈ వ్యాది వస్తుందని చెబుతున్నానరంట వైద్యులు.

అయితే సుస్రూణ్య తన మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి అమెరికాలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో వెల్ సెటిల్ అవ్వాలని కలలు కన్నదని ఆమె స్నేహితులు చెబుతున్నారట. మరోపక్క ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆమెను తిరిగి ఇండియా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా ఫండ్ రైజింగ్ జరుగుతోందని తెలుస్తుంది!

కాగా... ఈశాన్య అమెరికాలో పిడుగుల అలజడి భారీగా ఉందని వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... సుమారు 2,600 విమాన సర్వీసులను రద్దు చేయడంతోపాటు మరో 8,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని అంటున్నారు.

మరోవైపు మెరుపు వరదలు సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెళ్లడించిందని తెలుస్తుంది. ఇదే సమయంలో టోర్నడో వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయని అంటున్నారు.