Begin typing your search above and press return to search.

ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్నారైల కోసం స్పెషల్ సెంటర్!

By:  Tupaki Desk   |   12 Aug 2023 10:17 AM GMT
ఢిల్లీ విమానాశ్రయంలో ఎన్నారైల కోసం స్పెషల్ సెంటర్!
X

దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్నారైలు, ఇతర ప్రయాణికుల కోసం ఫెసిలిటేషన్ సెంటర్‌ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 24/7 పలురకాల సేవలు అందించనున్నారు. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

అవును... ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫెసిలిటేషన్ సెంటర్‌ ను ఏర్పాటు చేయాలని పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సెంటర్‌ లో 24 గంటలూ సిబ్బంది ఉంటారు. ఈ సేవల్లో భాగంగా.. ప్రయాణీకులు విమానాశ్రయం సమీపంలోని ప్రదేశాలకు వెళ్లేందుకు దాని సొంత వాహనాలను ఈ సెంటర్ కలిగి ఉంటుంది.

వారు అందించే సేవలలో అరైవల్ అండ్ కనెక్ట్ ఫ్లైట్ సమాచారం, టాక్సీ సేవలు, సామాను కోల్పోయిన వారికి సహాయం, పంజాబ్ భవన్ తోపాటు ఇతర సమీప స్థానాలకు స్థానిక రవాణా వంటివి ఉంటాయి. ఇదే సమయంలో సరసమైన ధరలకు అందించే క్యాబ్ సర్వీసులతో ఈ సెంటర్ టచ్ లో ఉంటుంది.

ప్రధానంగా ఎన్నారైలు, ఇతర ప్రయాణీకులు విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు.. వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పంజాబ్ గవర్నమెంట్ ఈ ఆలోచన చేసిందని అంటున్నారు. దీంతో పంజాబ్ ప్రభుత్వానికి అభినందనలు వెళ్లివెత్తుతున్నాయి. ఈ ఫెసిలిటేషన్ సెంటర్‌ అంతర్జాతీయ టెర్మినల్‌ లోని అరైవల్ హాల్‌ లో ఉంటుంది.

ఇరవైనాలుగు గంటలూ పనిచేసే ఈ ఫెసిలిటేషన్ సెంటర్ లో చాలా భాషలు మాట్లాడగలిగే ట్రైన్డ్‌ సిబ్బంది ఉంటారు. ఎన్నారైలు, ఇతర ప్రయాణీకులందరికీ ఈ ఫెసిలిటేషన్ సెంటర్ పూర్తి ఉచితంగా సేవలను అందిస్తుంది.