Begin typing your search above and press return to search.

ప్రాంక్ చేసినందుకు ప్రాణాలు తీసిన వ్యక్తికి జీవిత ఖైదు!

ఈ మధ్యకాలంలో ప్రాంకులు ఎక్కువైపోతున్నాయి

By:  Tupaki Desk   |   18 July 2023 5:44 AM GMT
ప్రాంక్ చేసినందుకు ప్రాణాలు తీసిన వ్యక్తికి జీవిత ఖైదు!
X

ఈ మధ్యకాలంలో ప్రాంకులు ఎక్కువైపోతున్నాయి. యూట్యూబ్ నిండా ప్రాంక్ వీడియోలు తెగ హల్ చల్ చేస్తుంటాయి. వీటిలో కొన్ని సరదాగా అనిపించగా.. మరికొన్ని అసహ్యంగా అనిపిస్తుంటే.. ఇంకొన్ని చికాకు పుట్టిస్తుంటాయి. ఆ సంగతి అలా ఉంటే... యూఎస్ లో ప్రాంక్ చేసిన వారి ప్రాణాలు తీశాడు ఇక భారతీయ సంతతి వ్యక్తి!

అవును... ప్రాంక్ పేరు చెప్పి తనను ఆట పట్టించిన విషయంపై కక్ష పెంచుకున్న ఇక భారతీయ సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో ముగ్గురుని పథకం ప్రకారం చంపేశాడట. దీంతో అతడికి జీవిత ఖైదు పడింది.

వివరాళ్లోకి వెళ్తే... అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తికి జీవిత ఖైదు పడింది. రాత్రివేళల్లో తరుచు డోర్‌ బెల్‌ కొట్టి ఆటపట్టించిన ముగ్గురు యువకులను హత్య చేసిన కేసులో భారత సంతతికి చెందిన అనురాగ్ చంద్ర దోషిగా తేల్చింది న్యాయ స్థానం. అయితే ఈ ఘటన 2020లో జరగగా... ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పు తాజాగా వెలువడిందని తెలుస్తుంది.

ఈ కేసుకు సంబంధించి ముగ్గురిని హత్య చేసినట్లు, మరో ముగ్గురిపై హత్యాయత్నం చేసినట్టు ఆరోపణలు రావడంతో కోర్టు అతడిని దోషిగా నిర్ధారించిందని తెలుస్తుంది. ఇదే సమయంలో అతడికి పెరోల్ అవకాశం కూడా లేదని తాజా తీర్పులో వెల్లడించిందని అంటున్నారు. రివర్ సైడ్ కౌంటీలోని జ్యూరీకి ఈ కేసులో తీర్పు ఇవ్వడానికి మూడు గంటలు పట్టినట్లు జిల్లా అటార్నీ కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపిందని సమాచారం.

అసలేం జరిగింది?:

జనవరి 19, 2020 రాత్రి టెమెస్కల్ కాన్యన్ రోడ్‌ లో ఆరుగురు యువకులు తమ ఫ్రెండ్ ఇంట్లో నిద్రించేందుకు వచ్చారట. ఈ సమయంలో ఓ ఆకతాయి కుర్రాడు డోర్ బెల్ మోగించి ఆటపట్టించే ప్రాంక్ చేద్దామని అన్నాడట. దీంతో వారి ఇంటికి పొరుగున్న ఉన్న అనురాగ్ చంద్ర ఇంటికి డోర్ బెల్ పలుమార్లు మోగించి ఆటపట్టించారట.

అయితే ఈ విషయాన్ని అనురాగ్ చంద్ర గ్రహించి సీరియస్ అవ్వడంతో ఆ ఆరుగురు తమ కారులో పారిపోయేందుకు ప్రయత్నించారట. దీంతో మరింత కోపోద్రిత్తుడైన అనురాగ్ చంద్ర తన కారులో వారిని వెంబడించి.. వారి కారును ఢీకొట్టాడట. దీంతో వారి కారు రోడ్డుపక్కనున్న గుంతలోకి దూసుకువెళ్లిందంట.

ఈ ప్రమాదం తరువాత.. అనురాగ్ చంద్ర సంఘటన గురించి ఎవరికీ తెలియజేయకుండా అక్కడి నుండి తన ఇంటికి తిరిగి వచ్చేశాడట. ఈ ప్రమాదంలో 16ఏళ్ల వయసున్న ముగ్గురు యువకులు... డేనియల్ హాకిన్స్, జాకబ్ ఇవెస్కు, డ్రేక్ రూయిజ్ మరణించారని తెలుస్తుంది. ఇదే సమయంలో డ్రైవర్‌ తో పాటు 13, 14 ఏళ్ల ఇద్దరు బాలురు గాయపడ్డారట.

దీంతో 2020 జనవరి 20న అరెస్ట్ అయిన అనురాగ్ చంద్ర అప్పటి నుండి రివర్ సైడ్ లోని రాబర్డ్ ప్రెస్లీ డిటెన్షన్ సెంటర్‌ లో కస్టడీలో ఉన్నాడట. తాజాగా అతడు నేరం అంగీకరించాడని తెలుస్తుంది.