Begin typing your search above and press return to search.

పవన్ కల్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి

తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి.. తనకు మద్దతు ఇవ్వాలని కోరటం గమనార్హం.

By:  Tupaki Desk   |   9 Nov 2023 4:20 AM GMT
పవన్ కల్యాణ్ మద్దతు కోరిన లండన్ మేయర్ అభ్యర్థి
X

అక్కడెక్కడో అల్లంత దూరాన ఉన్న లండన్ మహానగరానికి జరుగుతున్న మేయర్ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కోరారు భారత సంతతికి చెందిన తరుణ్ గులాటీ. తాజాగా ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలిసి.. తనకు మద్దతు ఇవ్వాలని కోరటం గమనార్హం.


లండన్ మేయర్ ఎన్నికల్లో తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణ్ గులాటీ.. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ప్రముఖుల్ని కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరటం తెలిసిందే. తాజాగా జనసేన అధినేత పవన్ ను కలిసి.. ఎన్నికల సందర్భంగా తనకు మద్దతు ఇవ్వాలని కోరటం ఆసక్తికరంగా మారింది.


ఈ సందర్భంగా తరుణ్ గులాటీ మాట్లాడుతూ.. తాను పోటీ చేస్తున్న లండన్ ప్రాంతంలో పవన్ కల్యాణ్ అభిమానులు.. జనసైనికులు పెద్ద ఎత్తున ఉన్నారని.. అందుకే ఆయన్ను కలిసినట్లుగా వివరించారు. తనను కలిసి.. తన మద్దతు కోరిన తరుణ్ గులాటీ అభ్యర్థనను జనసేన అధినేత స్వాగతించారు. అందుకు తగ్గట్లే.. జనసేన ఒక ప్రకటనను విడుదల చేసింది.

అందులో తరుణ్ గులాటీకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరింది. పవన్ అభిమానులు.. జనసేన శ్రేణులు.. తెలుగువారు.. భారతీయులు తరుణ్ గులాటీ గెలుపులో కీలకభూమిక పోషించాలని.. ఆయన గెలవాలన్న అకాంక్షను వ్యక్తం చేస్తూ పవన్ పేరు మీద ఒక ప్రకటనను విడుదల చేశారు. మరి.. తుది ఫలితం ఏ రీతిలో ఉండనుందో చూడాలి.