Begin typing your search above and press return to search.

17 సార్లు పొడిచి భార్యను చంపాడు... యూఎస్ లో ఇండియన్ కి జీవిత ఖైదు!

ఈ సమయంలో ఓ భారతీయ వ్యక్తికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. భార్యను సుమారు 17సార్లు కత్తితో పొడిచి చంపినందుకు ఇలా లైఫ్ పడింది!

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:37 AM GMT
17 సార్లు పొడిచి  భార్యను చంపాడు... యూఎస్  లో ఇండియన్  కి జీవిత ఖైదు!
X

ఇటీవల కాలంలో విదేశాల్లో నేరాలు చేయడంతో శిక్ష పడుతున్న భారతీయుల సంఖ్య పెరుగుతుంది! కొంతమంది ప్రమాదాలతో ఇబ్బందులు పడుతుంటే.. మరికొంతమంది దారుణాలకు పాల్పడి పత్రికలకెక్కుతున్నారు. ఈ సమయంలో ఓ భారతీయ వ్యక్తికి అమెరికా కోర్టు జీవిత ఖైదు విధించింది. భార్యను సుమారు 17సార్లు కత్తితో పొడిచి చంపినందుకు ఇలా లైఫ్ పడింది!

అవును... అమెరికాలో ఒక భారతీయ వ్యక్తి తన భార్యను విచక్షణారహితంగ పొడిచాడు. ఇందులో భాగంగా ఏకంగా 17సార్లు కత్తితో పొడిచి పొడిచి చంపాడు. ఫలితంగా... ఈ నెల 3న కోర్టు ఇచ్చిన తీర్పుతో అతడు జీవితాంతం జైలు జీవితం గడపనున్నాడు. అయితే ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అతడు అనుమానించడమే ఈ దారుణానికి కారణం అని తెలుస్తుంది.

వివరాళ్లోకి వెళ్తే... ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ హెల్త్ కోరల్ స్ప్రింగ్స్ హాస్పిటల్‌ లో 26 ఏళ్ల మెరిన్ జాయ్ నర్సుగా పనిచేసింది. ఈ క్రమంలో ఆమెకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని ఆమెభర్త భర్త ఫిలిప్ మాథ్యూ అనుమానించాడు. దీంతో ఎలాగైనా ఆమెను తుదముట్టించాలని ప్లాన్ చేశాడట! అందుకు ఎన్నోపథకాలు కూడా రచించాడని అంటున్నారు! ఈ సమయంలో ఆమెపై కత్తితో దాడిచేశాడు.

ఇందులో భాగంగా... 2020 ఏడాదిలో ఆసుపత్రి పార్కింగ్‌ వద్ద ఆమె కారును తన కారుతో అడ్డుకున్నాడు. అనంతరం కారులో ఉంచిన కత్తి తీసి దాంతో 17 సార్లు ఆమెను దారుణంగా పొడిచాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆమె నేలపై పడిపోయింది. అయినప్పటికీ ఆగ్రహం చల్లారలేదో ఏమో కానీ... రక్తపు మడుగులో కింద పడిపోయిన ఆమె మీదుగా కారును నడిపి పారిపోయాడు.

దీంతో తీవ్రంగా గాయపడిన మెరిన్ జాయ్‌ ను ఆసుపత్రికి తరలించారు. తాను ఒక బిడ్డ తల్లినంటూ ఆ సమయంలో ఆమె తీవ్రంగా రోధించింది, తనను భర్తే కత్తితో పొడిచి పారిపోయినట్లు తెలిపింది. ఆ తర్వాత చికిత్స పొందుతూ హాస్పిటల్ లోనే మరణించింది. ఈ నేపథ్యంలో నిందితుడైన ఫిలిప్ మాథ్యూను ఫ్లోరిడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సమయమోనే సుమారు మూడేళ్లుగా ఈ కేసుపై విచారణ జరిపిన ఫ్లోరిడా కోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది.

ఇందులో భాగంగా... అతడికి ఫ్లోరిడా కోర్టు జీవితకాల కారాగార శిక్ష విధించింది. అలాగే మారణాయుధంతో దాడి చేసినందుకు అదనంగా ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొంది. ఈ సమయంలో అప్పిల్ చేయబోనని మాథ్యూ తెలిపాడు. దీంతో... జీవిత ఖైదు ఖచ్చితత్వంతో ప్రతివాది అప్పీలు చేసుకునే హక్కును వదులుకుంటున్నందున మరణశిక్షను మినహాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ అటార్నీ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.

ఈ క్రమంలో తన కూతురిని చంపిన వ్యక్తి.. అతని మిగిలిన జీవితమంతా జైలులో ఉంటాడని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. చట్టపరమైన ప్రక్రియ ముగిసిందని తెలుసుకోవడం ద్వారా ఆమె ఉపశమనం పొందింది అని జాయ్ బంధువు ఒకరు "జాయ్ తల్లి" గురించి వెల్లడించారు.