Begin typing your search above and press return to search.

భారతీయులకు బియ్యం కష్టాలు... ఇప్పుడు ఆస్ట్రేలియాలో..!

ఇదే క్రమంలో ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా బియ్యం కొనుగోళ్లు కూడా బాగా పెరిగాయని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   26 July 2023 1:15 PM GMT
భారతీయులకు బియ్యం కష్టాలు... ఇప్పుడు ఆస్ట్రేలియాలో..!
X

గతకొన్ని రోజులుగా అమెరికా లో భారతీయుల కు, మరి ముఖ్యంగా తెలుగువారికి బియ్యం కష్టాలు వచ్చాయంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆందోళనకు గురైన భారతీయులు బియ్యం దుకాణాలవద్ద క్యూ కట్టారనే వీడియోలు వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పరిస్థితి ఆస్ట్రేలియాలో కూడా మొదలైందని తెలుస్తుంది.

అవును... భారత్ నుంచి విదేశాల కు ఎగుమతి అయ్యే బాస్మతీయేతర బియ్యం ఎగుమతుల ను నిషేధించడంతో అమెరికా లో భారతీయులు స్టోర్లకు ఎగబడి బస్తాలు బస్తాలు ఎలా కొనుక్కున్నారనేదానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తోంది.

బాస్మతీయేతర బియ్యం దిగుమతులు ఆగాయని తెలియగానే అమెరికాలోని భారతీయులు బియ్యం పెద్ద ఎత్తున నిల్వ చేసుకునేందుకు పోటీలుపడ్డారు. సాధారణంగా ఎన్నారైలు నెలకు సరిపడా బియ్యం కొనుక్కుంటారు. కానీ భారత్ నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోయాయనే ఆందోళనతో భారతీయులు బస్తాల కొద్దీ బియ్యం కొనేస్తున్నారు.

ఇదే క్రమంలో ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా బియ్యం కొనుగోళ్లు కూడా బాగా పెరిగాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఈ విషయాల ను సర్రే హిల్స్ లో నివసిస్తున్న ఎంజీఎం స్పైసెస్ అనే కిరాణా స్టోర్ మేనేజర్ శిశిర్ శర్మ తెలిపారని అంటున్నారు.

అమెరికా లో బియ్యం దిగుమతుల పై నిషేదం విధించించ బడింది కాబట్టి.. తర్వాత ఆస్ట్రేలియాలో కూడా ఆ పరిస్థితి ఎదురయ్యే ప్రమాధం ఉందని గ్రహించారో ఏమో.. ఇలా ముందుజాగ్రత్త చర్యలకు దిగారని తెలుస్తోంది.

ఇదే సమయం లో తగినంత నిల్వలు తమవద్ద లేవని చెబుతున్నా ఎవ్వరు వినటంలేదని... ఫలితంగా తప్పని పరిస్థితుల్లో ఒక వ్యక్తికి 5 కిలోల బియ్యం మాత్రమే అమ్ముతున్నామని చెబుతున్నారట. దీంతో కొంతమంది భారతీయులు వాగ్వాదానికి దిగుతున్నారని చెబుతున్నారంట.