Begin typing your search above and press return to search.

కెనడాలో ప్రమాదం.. న్యూజెర్సీలో దారుణం..ఆరుగురు ఇండియన్స్ మృతి!

నాలుగు రోజుల క్రితం జింబాబ్వేలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారతీయ బిలియనీర్ హర్పాల్ రంధవా మరణించిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   7 Oct 2023 10:37 AM GMT
కెనడాలో ప్రమాదం.. న్యూజెర్సీలో దారుణం..ఆరుగురు ఇండియన్స్ మృతి!
X

నాలుగు రోజుల క్రితం జింబాబ్వేలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో భారతీయ బిలియనీర్ హర్పాల్ రంధవా మరణించిన సంగతి తెలిసిందే. ఆ విమాన హర్పాల్ రంధవా తో పాటు ఆయన కుమారుడు కూడా మరణించాడు. ఈ క్రమంలో తాజాగా కెనడాలో జరిగిన మరో ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు.

అవును... వారం రోజుల వ్యవధిలో విదేశాల్లో జరిగిన వరుస విమాన ప్రమాదాల్లో నలుగురు మరణించినట్లయ్యింది. నాలుగు రోజుల క్రితం జింబాబ్వే లో జరిగిన విమాన ప్రమాదంలో ఇండియన్ బిలియనీర్, ఆయన కుమారుడితో సహా మరణించగా... తాజాగా కెనడాలో జరిగిన మరో ఘోర విమాన ప్రమాదంలో ఇద్దరు ఇండియన్స్ మృతిచెందారు.

వివరాళ్లోకి వెళ్తే... ఈ రోజు తెల్లవారుజామున పీఏ-34 సెసీనా అనే విమానం బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్‌ లో అకస్మాత్తుగా చెట్టును ఢీకొట్టి పొదల్లో కూలిపోయిందని, ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారు మరణించారని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

అయితే... ఆ ముగ్గురిలో ఇద్దరు ఇండియన్స్ కాగా.. మిగిలిన వ్యక్తి ట్రైనీ పైలైట్ అని అంటున్నారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని ముంబై వాసులు అభయ్ గాడ్రూ, యశ్ విజయ్ రాముగాడే అక్కడికక్కడే మృతి చెందారని తెలుస్తుంది. వీరిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారని స్థానిక మీడియా పేర్కొంది.

న్యూజెర్సీలో భారతీయ ఫ్యామిలీ అనుమానాస్పద మృతి!:

మరోపక్క అమెరికాలోని న్యూజెర్సీలో భారతీయ సంతతికి చెందిన జంటతో పాటు వారి ఇద్దరు పిల్లలు తమ ఇంట్లో శవమై కనిపించడం సంచలనం కలిగించింది. అయితే వీరిది హత్యా, ఆత్మహత్యా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు మాత్రం వీరిది హత్య అనే కోణంలోనే దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తుంది.

మృతులు... తేజ్ ప్రతాప్ సింగ్ (43), సోనాల్ పరిహార్ (42), పదేళ్ల కుమారుడు, ఆరేళ కుమార్తె గా గుర్తించినట్లు ప్లెయిన్స్‌ బోరో పోలీస్ డిపార్ట్ మెంట్ తెలిపింది. మరోవైపు తేజ్ ప్రతాప్ సింగ్ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉండేవారని.. అందరితోనూ స్నేహంగా ఉండేవారని.. ఈ ఘటన ఎలా జరిగిందో అర్ధం కావట్లేదని స్థానికులు, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తేజ్‌ ప్రతాప్‌ ఓ ఐటీ సంస్థలో ఇంజినీర్‌ గా పనిచేస్తుండగా.. ఆయన భార్య కూడా మరో ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్‌ విభాగంలో ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.