కెనడాలో భారతీయ విద్యార్థిపై కాల్పులు.. అక్కడికక్కడే మృతి!
మరో దారుణం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు.
By: Tupaki Desk | 26 Dec 2025 10:19 AM ISTమరో దారుణం చోటు చేసుకుంది. విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించడానికి వెళ్లిన మరో భారతీయ విద్యార్థి మృతి చెందాడు. టొరంటో విశ్వవిద్యాలయ స్కార్ బరో క్యాంపస్ సమీపంలో జరిగిన కాల్పుల్లో భారతీయ డాక్టరోల్ విద్యార్థి 20 ఏళ్ల శివంక్ అవస్థీ మృతి చెందినట్లు చెబుతూ.. టొరంటోలోని భారత కాన్సులేట్ జనరల్ విచారం వ్యక్తం చేసింది. ఈ సమయంలో.. మృతుని కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపింది.
అవును... విదేశాల్లోని తుపాకీ తూటాలకు మరో భారతీయ విద్యార్థి బలైపోయారు. ఇందులో భాగంగా... భారతీయ డాక్టరోల్ విద్యార్థి శివంక్ మృతి చెందాడు. ఈ విధయాలను భారత కాన్సులేట్ వెల్లడించింది. ఈ క్లిష్ట సమయంలో మృతుని కుటుంబంతో సన్నిహితంగా ఉన్నామని.. స్థానిక అధికారుల సమనవయంతో అవసరమైన అన్ని సహాయాలను అందిస్తున్నామని తెలిపింది. హైలాండ్ క్రీక్ ట్రైల్, ఓల్డ్ కింగ్ స్టన్ రోడ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు.
విషయం తెలిసిన వెంటనే తుపాకీ తూటాలతో గాయాలపాలైన అతన్ని చూడటానికి అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నా.. అతను అప్పటికే అక్కడికక్కడే మరణించినట్లు ప్రకటించారు. ఇదే సమయంలో.. పోలీసులు వచ్చేలోపు నిందితులు పారిపోయారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ క్రమమో క్యాంపస్ ను కొద్ది సేపు మూసివేశారు. ఈ ఏడాది టొరంటోలో జరిగిన 41వ హత్యగా ఇది గుర్తించబడిందని అధికారులు తెలిపారు.
ఈ తాజా ఘటన విద్యార్థులు తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను రేకెత్తించిందని చెబ్తున్నారు. లైఫ్ సైన్సెస్ లో మూడో సంవత్సరం చదువుతున్న శివంక్ అవస్థిని క్యాంపస్ లోయలో పట్టపగలు కాల్చి చంపారని ఓ విద్యార్థి తెలిపాడు. ఇక, శివాంక్ అవషీ టొరంటో స్కార్ బరో విశ్వవిద్యాలయలో చీర్ లీడింగ్ బృందంలో కూడా సభ్యుడని చెబుతూ వారు ఇన్ స్టాగ్రామ్ పోస్టులో అతనికి నివాళులర్పించారు. అతన్ని అకస్మాత్తుగా కోల్పోవడం తమకు బాధ, షాక్ అని వారు తెలిపారు.
కాగా.. ఇటీవల టొరంటోలోనే భారత సంతతికి చెందిన 30 ఏళ్ల హిమాన్షి ఖురానా హత్యకు గురైన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో.. ఈ హత్యకు సంబంధించి టొరంటోకు చెందిన అబ్దుల్ గఫూరీ కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఆ కేసులో సన్నిహిత భాగస్వామి హింస ఉన్నట్లు కనిపిస్తోందని పోలీసులు తెలిపారు. మరోవైపు.. హిమాన్షి కుటుంబానికి భారత కాన్సులేట్ సహాయం చేసినట్లు చెబుతున్నారు.
