Begin typing your search above and press return to search.

ట్రంప్ కు షాక్... హార్వర్డ్ లో అంతర్జాతీయ విద్యార్థి ఊపిరి పీల్చుకో!

హార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   24 May 2025 8:57 AM IST
ట్రంప్  కు షాక్... హార్వర్డ్  లో అంతర్జాతీయ విద్యార్థి ఊపిరి పీల్చుకో!
X

హార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ వర్సిటీ, స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ (ఎస్.ఈ.వీ.పీ) కింద అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకునే హక్కును కోల్పోయింది! ఈ సమయంలో ట్రంప్ కు షాక్ తగిలింది.

అవును... అంతర్జాతీయ విద్యార్థుల చేర్చుకునే సంస్థ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుని.. ఆ నిర్ణయంపై దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. ట్రంప్ పరిపాలన తీసుకొన్న తాజాగా నిర్ణయాన్ని అమెరికా రాజ్యాంగంపై స్పష్టమైన ఉల్లంఘనగా అభివర్ణించింది.

విదేశీ విద్యార్థులను చేర్చుకునే అనుమతిని రద్దు చేయడంతో 7,000 మందికి పైగా వీసాదారులపై తక్షణ, వినాశకరమైన ప్రభావాన్ని చూపిందని హార్వర్డ్ వర్సిటీ బోస్టన్ ఫెడరల్ కోర్టులో ఫిర్యాదు చేసింది. ఒక కలం పోటుతో హార్వర్డ్ వర్సిటీలోని నాలుగో వంతును.. దాని లక్ష్యానికి గణనీయంగా దోహదపడే అంతర్జాతీయ విద్యార్థులను తుడిచిపెట్టడానికి ప్రయత్నించిందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో... హార్వర్డ్ విదేశీ విద్యార్థులను చేర్చుకొనే హక్కును రద్దు చేయకుండా న్యాయమూర్తి ట్రంప్ ను అడ్డుకున్నారు. దీంతో... ఈ చర్య విద్యా రంగంలో ట్రంప్ సర్కార్ అనుసరిస్తోన్న విధానాలపై సరికొత్త చర్చకు తెరలేపిందని అంటున్నారు. అలాగే.. అంతర్జాతీయ విద్యార్థి లేకుండా హార్వర్డ్, హార్వర్డ్ కాదనే మాటకు బలం చేకూర్చిందని చెబుతున్నారు!

తాజాగా హార్వర్డ్ విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని స్తంభింపచేస్తూ యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అల్లిసర్ బరోస్ ఉత్తర్వును జరీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హార్వర్డ్ దావా వేసిన కొన్ని గంటల్లోనే జడ్జి అల్లిసన్ బరోస్ ఈ తీర్పును జారీ చేశారు. దీంతో.. ఈ తీర్పు వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు తాత్కాలిక ఉపశమనం కలిగిస్తోంది.

ఈ క్రమంలో.. ఈ విధానాన్ని రెండు వారాలపాటు నిలివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన అల్లిసర్ బరోస్.. ఈ కేసులో తదుపరి చర్యలను పరిశీలించడానికి ఈ నెల 27, 29 తేదీలలో విచారణలను షెడ్యూల్ చేశారు.