Begin typing your search above and press return to search.

హెచ్-1బి వీసాల రెట్టింపు...STEM కోసం HIRE!

అమెరికాలో విదేశీ ఉద్యోగులను తీసుకోవడంకోసం

By:  Tupaki Desk   |   19 July 2023 5:36 AM GMT
హెచ్-1బి వీసాల రెట్టింపు...STEM కోసం HIRE!
X

అమెరికాలో విదేశీ ఉద్యోగులను తీసుకోవడంకోసం వీసాలు రెట్టింపు కాబోతున్నాయా.. వీటి సంఖ్య 65వేల నుంచి లక్షా ముప్పైవేల వరకూ పెరగబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తుందని తెలుస్తుంది.

అవును... విదేశీ ఉద్యోగులను వార్షికంగా తీసుకోవడాన్ని రెట్టింపు చేయాలని ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభ సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారని తెలుస్తుంది. ఇది భారతీయులు పని చేయడానికి, జీవించడానికి.. ఈ దేశ పౌరసత్వం పొందేందుకు గేట్ వే అని అంటున్నారు.

ఈ సందర్భంగా... భారత సంతతికి చెందిన డెమోక్రటిక్ శాసనసభ్యుడు రాజా కృష్ణమూర్తి గత శుక్రవారం ప్రవేశపెట్టిన బిల్లు వార్షిక హెచ్-1బి వీసాలను 65,000 నుండి 130,000కి పెంచడానికి ప్రయత్నిస్తుందని తెలుస్తుంది. ఫలితంగా... స్పెషాలిటీ వర్కర్ల కొరతను భర్తీ చేయాలని భావిస్తుందని అంటున్నారు.

ముఖ్యంగా అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్‌ బుక్ వంటి సంస్థలతోపాటు ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ సంస్థల అవసరాల నిమిత్తం ఈ వీసాలు పొడిగించాలని భావిస్తున్నారని అంటున్నారు.

ఈ సందర్భంగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేసిన కృష్ణమూర్తి... హెచ్-1బీ వీసా ప్రోగ్రాం విస్తరణ అమెరికా కంపెనీలకు అత్యవసరమైన స్థానాలకు కార్మికులను పొందేందుకు దోహదపడుతుందని తెలిపారని అంటున్నారు. ఈ చట్టాన్ని "హైర్ స్కిల్డ్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ ఫర్ ఎంప్లాయ్మెంట్" సంక్షిప్తంగా "హైర్ యాక్ట్" అని పిలుస్తారని తెలుస్తుంది.

ఇదే సమయంలో "ఉద్యోగాలను సృష్టించడం, భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను నిర్మించడం కోసం దేశీయ శ్రామిక శక్తిని అభివృద్ధి చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ప్రతిభను పొందడం ద్వారా సాంకేతికతలో ముందుండాలి" అని కృష్ణమూర్తి అన్నారని తెలుస్తుంది.

అందులో భాగంగానే... 65,000 నుండి 130,000కి అందుబాటులో ఉన్న హెచ్-1బి వీసాల సంఖ్యను రెట్టింపు చేస్తూ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యలో పెట్టుబడులను పెంచడానికి ఈ "హైర్ యాక్ట్" ని ప్రవేశపెట్టడం తనకు గర్వకారణంగా ఉందని ఈ సందర్భంగా కృష్ణమూరి తెలిపారని అంటున్నారు.

ఇదే సమయంలో పాఠశాలల్లోని STEM (సైన్స్, టెక్, ఇంజినీరింగ్, మ్యాథ్) స్ట్రీమ్‌ లకు నిధులు సమకూర్చడం ద్వారా అమెరికాలో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను పరిష్కరించేందుకు కూడా ఈ చట్టం ప్రయత్నిస్తుందని అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే... ఇకపై అమెరికాకు బయలుదేరే భారతీయుల సంఖ్య రెట్టింపు అవ్వొచ్చని అంటున్నారు పరిశీలకులు.