H-1B లాటరీ సిస్టమ్ రద్దు: ఇక ముందేం జరుగుతుంది?
డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసా నిబంధనల్లో తీసుకువస్తున్న మార్పులు భారతీయ ఐటీ రంగంలో పెను సంచలననాన్ని సృష్టిస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Dec 2025 4:19 PM ISTడొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం హెచ్1బీ వీసా నిబంధనల్లో తీసుకువస్తున్న మార్పులు భారతీయ ఐటీ రంగంలో పెను సంచలననాన్ని సృష్టిస్తున్నాయి. దశాబ్దాలుగాకొనసాగుతున్న ‘లాటరీ విధానం ’ రద్దు కావడంతో ఇకపై అమెరికా వెళ్లాలనుకునే వారి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? దీనివల్ల ఎవరికి లభం? ఎవరికినష్టం? అనేది తెలుసుకుందాం
ఇప్పటివరకూ హెచ్1బీ వీసాల ఎంపిక రాండమ్ సెలక్షన్స్ పద్ధతిలో జరిగేది. అంటే అర్హత ఉన్న లక్షలాది మందిలో కంప్యూటర్ ఎంపిక చేసిన వారికే వీసా వచ్చేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఈ లాటరీ వ్యవస్థ స్థానంలో వేతనం ప్రాధాన్యత సంతరించుకుంటుంది.
వేతనం,నైపుణ్యం ఆధారిత ఎంపిక
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) నిబంధనల ప్రకారం.. దరఖాస్తుదారులను వారి వేతన స్థాయిల ఆధారంగా వర్గీకరిస్తారు. అత్యధిక వేతనం పొందే అభ్యర్థులకు మొదట వీసాలు కేటాయిస్తారు. తక్కువవేతనంతో అమెరికా వెళ్లే ఎంట్రీ లెవల్ ఉద్యోగులకు వీసా లభించడం దాదాపు అసాధ్యం కావచ్చు.
అమలులోకి వచ్చే తేదీ
ఈ కొత్త నిబంధనలు 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే 2027 ఆర్థిక సంవత్సరం కోటా కోసం దరఖాస్తు చేసేఅభ్యర్థులు ఈ కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
భారతీయులపై పడే ప్రభావం
భారతీయ ఐటీ నిపుణులు అమెరికా హెచ్1బీ వీసాల్లో సుమారు 70 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నారు. తాజాగా మార్పులు వీరిపై భిన్నమైన ప్రభావం చూపనున్నాయి. సీనియర్ డెవలపర్లు, ఆర్కిటెక్లు , డేటా సైంటిస్టుల వంటి అధిక వేతనం తీసుకునే నిపుణులకు వీసా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కేవలం డిగ్రీ పూర్తి చేసి.. తక్కువ వేతనంతో అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు, జూనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు ఇది గట్టి దెబ్బ. ఎంఎన్.సీ కంపెనీలు తమ వ్యూహాన్ని మార్చాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్,విప్రో వంటిసంస్థలు తక్కువ వేతనంతో విదేశీ ఉద్యోగులను పంపడం ఇకపై కష్టమవుతుంది. దీనివల్ల వారు అమెరికాలోనే స్థానికులను నియమించుకోవడమో లేదా ప్రాజెక్టుల ఖర్చును పెంచడమో చేయాల్సి ఉంటుంది.
ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి?
ట్రంప్ ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం ఈ మార్పుల వెనుక ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. స్థానిక అమెరికన్ల ఉద్యోగాలను కాపాడటం.. నకిలీ దరఖాస్తులు ,కన్సల్టెన్సీల ద్వారా జరిగే లాటరీ మోసాలను తగ్గిస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ నైపుణ్యం ఉన్న మేధావులను మాత్రమే అమెరికాకు ఆహ్వానిస్తారు.
కోటాలో మార్పు ఉందా?
ప్రతి సంవత్సరం జారీ చేసే 65000 సాధారణ కోటా, 20000 మాస్టర్స్ కోటాలో ఎటువంటి మార్పు లేదు. మొత్తం 85000 వీసాలు అలాగే ఉంటాయి. కానీ వాటిని పంపిణీచేసే పద్ధతి మాత్రమే మారుతుంది.
ఇకపై ‘అమెరికన్ డ్రీమ్’ సాధించాలంటే..
హెచ్1బీ నిబంధనల మార్పుతోఅమెరికా వెళ్లడం అనేది కేవలం అదృష్టం మీద ఆధారపడే విషయం కాదు. ఇకపై అది పూర్తిగా మీనైపుణ్యం , మీ కంపెనీ ఇచ్చే వేతనం మీద ఆధారపడి ఉంటుంది. భారతీయ ఐటీ నిపుణులు ప్రపంచ స్థాయి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మాత్రమే ఈ కొత్త సవాళ్లను అధిగమించగలరు.
