Begin typing your search above and press return to search.

హెచ్ 1బీ వీసాలో మార్పులు.. భారత విద్యార్థులకు గుడ్ న్యూస్

డాలర్ డ్రీమ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే హెచ్1బీ వీసా జారీలో మార్పులు భారత విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

By:  Tupaki Desk   |   22 Oct 2023 4:30 PM GMT
హెచ్ 1బీ వీసాలో మార్పులు.. భారత విద్యార్థులకు గుడ్ న్యూస్
X

డాలర్ డ్రీమ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే హెచ్1బీ వీసా జారీలో మార్పులు భారత విద్యార్థులకు ప్రయోజనం కలిగించేలా చేస్తాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బైడెన్ సర్కారు ప్రతిపాదించిన హెచ్ 1బీ వీసా జారీ మార్పులు వీసాదారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేలా చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న విధానాలకు తాజాగా తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదనల విషయానికి వస్తే.. ఉన్నత విద్య కోసం విద్యార్థులకు జారీ చేసే ఎఫ్1 వీసాదారులకు మరింత సౌకర్యవంతంగా హెచ్1బీ వీసా మార్పులు ఉంటాయని చెబుతున్నారు.

ఈ నెల 23న (సోమవారం) ఫెడరల్ రిజిస్ట్రీలో యూఎస్ సిటిషన్ షిప్.. ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ అధికారులు పబ్లిష్ చేయనున్నారు. వీసాలకు సంబంధించి కాంగ్రెస్ పేర్కొన్న ఒక ఏడాదిలో 60 వేలకు మించకూడదన్న నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ వీసా ఆయా సంస్థలకు మూడేళ్ల నుంచి ఆరేళ్ల పాటు నియమించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.

హెచ్1బీ వీసాలను మరింత పాదర్శకంగా చేసేందుకు బైడెన్ సర్కారు సిద్ధం చేసిన ప్రతిపాదనల్ని చూస్తే.. మరింత సామర్థ్యం.. నైపుణ్యం ఉన్న ఉద్యోగుల్ని తీసుకునేందుకు.. సంస్థలపై భారం తగ్గించేలా చేస్తాయని చెబుతున్నారు. నకిలీ వీసాలు.. అనర్హులు.. అనధికార వలసలకు అడ్డుకట్టు పడేలా ఈ మార్పులు ఉండనున్నాయి. ప్రస్తుతం అమలు చేస్తున్న విధానంలో ఒక వ్యక్తి ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినా దాఖలు చేసే వీలుంది. సదరు వ్యక్తి లాటరీలో పదే పదే ఎంపిక అయ్యేందుకు వీలు ఉంటుంది. కానీ.. కొత్తగా చేస్తున్న ప్రతిపాదనలో మాత్రం అందుకు భిన్నంగా ఎన్ని రిజిస్ట్రేషన్లు చేసుకున్నాఅభ్యర్థి ఒక్కసారి మాత్రమే ఎంపికవుతారు.

విద్యార్థులు అవసరానికి అనుగుణంగా ఎఫ్1 వీసాలను హెచ్1బీగా మార్చుకునే వీలు కల్పించాలన్న ప్రతిపాదన.. భారత విద్యార్థులకు మేలు చేసే అంశంగా చెప్పాలి. కొత్తగా ప్రతిపాదిస్తున్న విధానాలతో భారతీయుల మీద ప్రభావం కచ్ఛితంగా ఉంటుందని చెబుతున్నారు. మరిన్ని డాక్యుమెంట్లను సమర్పించటంతో పాటు.. పని చేసే ప్రాంతాన్ని కచ్ఛితంగా సందర్శించాల్సి ఉంటుంది. హెచ్1బీ వీసాల్ని కోరుకునే భారతీయులను అదనంగా స్క్రూటినీ చేసే పరిస్థితి ఉంటుందని.. దీంతో భారతీయులకు ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు. అయితే.. చట్టబద్ధమైన ఉపాధిని పొందే వారికి ఇబ్బందులు ఉండవు కానీ.. నకిలీలకు మాత్రం అవకాశం లేకుండా చేసేందుకే తాజా మార్పులు ఉద్దేశించినట్లుగా చెబుతున్నారు.