Begin typing your search above and press return to search.

అక్కడ పెళ్లికూతుళ్ల మార్కెట్.. ఎలా జరుగుతుందంటే?

కూరగాయల మార్కెట్.. పూల మార్కెట్.. బంగారు షాపుల బజారు.. ఇలా చాలానే మార్కెట్ల గురించి విని ఉండొచ్చు.

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:06 AM GMT
అక్కడ పెళ్లికూతుళ్ల మార్కెట్.. ఎలా జరుగుతుందంటే?
X

కూరగాయల మార్కెట్.. పూల మార్కెట్.. బంగారు షాపుల బజారు.. ఇలా చాలానే మార్కెట్ల గురించి విని ఉండొచ్చు. కానీ.. ఇప్పుడు చెప్పే మార్కెట్ గురించి తెలిసి ఉండదు. కలలో కూడా ఊహించని రీతిలో నిర్వహించే ఈ మార్కెట్ గురించిన సమాచారం షాకింగ్ గా ఉంటుంది. పెళ్లీడుకు వచ్చిన పెళ్లికూతుళ్లను అక్కడ ఏర్పాటు చేసే మార్కెట్లకు తీసుకొచ్చి.. అమ్మేసే అధికారిక సంత గురించి తెలిస్తే.. ఇప్పుడున్న డిజిటల్ యుగంలోనూ ఇలాంటివి జరుగుతాయా? అన్న సందేహం కలుగకమానదు.

ఈ సిత్రమైన మార్కెట్ కు కేరాఫ్ అడ్రస్ బల్గేరియా. బ్రైడల్ మార్కెట్ గా పేరున్న ఈ మార్కెట్ లో పెళ్లి కుమార్తెల్ని అమ్మేస్తుంటారు. అధికారికంగా సాగే ఈ మార్కెట్ లో అసలేం జరుగుతుంది? అన్న వివరాల్లోకి వెళితే.. షాకింగ్ అంశాలు వెలుగు చూస్తాయి. బల్గేరియాలోని స్టారా జాగోర్ అనే ప్రాంతంలో తమ ఇంట్లోని పెళ్లీడు అమ్మాయిల్ని వారి కుటుంబం ఆ మార్కెట్ కు తీసుకొస్తారు.

అదే సమయంలో పెళ్లి చేసుకోవాలని భావించే అబ్బాయిల కుటుంబాలు కూడా ఆ మార్కెట్ కు వస్తారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి.. అక్కడున్న అమ్మాయిల్ని చూస్తారు. అబ్బాయి కుటుంబానికి నచ్చిన అమ్మాయి వారి వద్దకు వెళ్లి.. తమ వివరాలు చెప్పి బేరం మొదలు పెడతారు. అబ్బాయి తరఫు వారు ఇచ్చే డబ్బులు తమకు సరిపోతాయనుకుంటే డీల్ కుదురుతుంది. అనంతరం అమ్మాయిని అబ్బాయి ఇంటికి తీసుకొచ్చి భార్య హోదాను ఇస్తారు. పేద అమ్మాయిల కోసం ఈ వధువుల మార్కెట్ ఏర్పాటు చేసినట్లుగా చెబుతారు.

పెళ్లి అంటే ఖర్చుతో కూడున్న కార్యక్రమం కావటంతో.. అలాంటిదేమీ లేకుండా సింఫుల్ గా పెళ్లి ప్రక్రియను పూర్తి చేసేందుకు ఈ తరహా ఏర్పాట్లు చేసినట్లు స్థానిక అధికారులు చెబుతుంటారు. కొన్నేళ్లుగా సాగుతున్న ఈ ప్రక్రియ సోషల్ మీడియా పుణ్యమా అని బయటకువచ్చింది. ఈ మార్కెట్ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి కూడా ఉంది.