Begin typing your search above and press return to search.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన శిశువు దుర్మరణం!

ఈ ఘటనలో ఏడాది వయసున్న వారి చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు.

By:  Tupaki Desk   |   4 April 2024 12:08 PM GMT
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణకు చెందిన శిశువు దుర్మరణం!
X

అమెరికాలో మరో ప్రమాదం తెలుగు వారిని బలి తీసుకుంది. దీంతో... ఇటీవల కాలంలో అమెరికాలో ప్రమాదాల భారిన పడుతున్న భారతీయుల జాబితా మరోసారి పెరిగింది! ఇందులో భాగంగా... తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ జంట.. తమ శిశువును కోల్పోయింది. అత్యంత దారుణమైన ఈ ఘటన అమెరికాలో జరిగింది.

వివరాళ్లోకి వెళ్తే... మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లకు చెందిన బొమ్మిడి అనూష, కొమ్మారెడ్డి సుశీల్ దంపతులు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఈక్రమంలో.. ఇటీవల తమ కుమారుడు అద్వైత్ (11) కి ఫేషియల్ థెరపీ చేయించి తిరిగి వస్తున్నారు. ఈసమయంలో... ఫ్లోరిడాలోని స్టేట్ రోడ్ 73 లో కాటన్ డేల్ వద్ద వీరి కారు ప్రమదానికి గురైంది.

ఈ ఘటనలో ఏడాది వయసున్న వారి చిన్న కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన అనంతరం ఆ శిశువును రక్షించడానికి హెలీకాప్టర్ లో వైద్యశాలకు తరలించినా ప్రయోజనం లేదు! ఇక ఈ ఘటనలో సుశీల్ - అనూష దంపతులతో పాటు వారి పెద్ద కుమారుడు అద్వైత్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం వీరు డోథన్ లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో అద్వైత్‌, సుశీల్‌ లకు మరింతగా తీవ్ర గాయాలు అవ్వడంతో వారు ప్రస్తుతం ఐసీయూలో ఉండి చికిత్స పోందుతున్నారని తెలుస్తుంది! ఈ ప్రమాదంలో ఏడాది వయసున్న వీరి చిన్న కుమారుడు మృతిచెందడంతో... జడ్చర్లలోని వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది! గోఫండ్‌ మీ డొనేషన్స్ ప్రకారం... సుశీల్, అద్వైత్‌ లకు తలకు బలమైన గాయాలు ఉన్నాయని నివేదించబడగా.. అనూష ఎడమ కాలు, ముఖానికి అనేక పగుళ్లు ఏర్పడింది.