Begin typing your search above and press return to search.

వరుణ్ రాజ్ విషయంలో అమెరికా రియాక్షన్... తాజా ఆరోగ్య పరిస్థితి ఇదే!

ప్రస్తుతం దాడికి సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ విభాగం ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.

By:  Tupaki Desk   |   3 Nov 2023 3:01 PM GMT
వరుణ్  రాజ్  విషయంలో అమెరికా రియాక్షన్... తాజా ఆరోగ్య పరిస్థితి ఇదే!
X

అమెరికాలో దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన తెలుగు విద్యార్ధి వరుణ్ రాజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో క్రిటికల్ కండిషన్ లో ఉన్నాడని తెలుస్తుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం గ్రామానికి చెందిన వరుణ్‌ రాజ్.. ఇండియానాలో ఎంఎస్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో... అక్టోబరు 30న జిం నుంచి బయటకు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ విషయంపై తాజాగా అగ్రరాజ్యం స్పందించింది.

అవును... వరుణ్ రాజ్ పుచ్చా పై జరిగిన దాడిపై అమెరికా స్పందించింది. తమ దేశంలో భారత విద్యార్థిపై జరిగిన దాడి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రస్తుతం దాడికి సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ విభాగం ప్రతినిధి మీడియాతో మాట్లాడారు.

ఇందులో భాగంగా... భారత విద్యార్థి వరుణ్‌ రాజ్‌ పుచ్చాపై జరిగిన క్రూరమైన దాడి ఘటన నివేదికలు తీవ్రంగా కలవరపెడుతున్నాయని యూఎస్ విదేశాంగ ప్రనిధి వెల్లడించారు. ఈ సందర్భంగా వరుణ్ సురక్షితంగా తిరిగిరావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరోపక్క.. వరుణ్‌ రాజ్‌ చికిత్స, అతని తల్లిదండ్రుల అమెరికా ప్రయాణ ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం "గోఫండ్‌"లో విరాళాల సేకరణ ప్రారంభించింది. ఇందులో భాగంగా 2,50,000 డాలర్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది!

ఇక వరుణ్ రాజ్ ఆరోగ్యం విషయానికొస్తే... లూథరన్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడు ఇంకా కోమాలోనే ఉన్నాడు. ప్రస్తుతం లైఫ్‌ సపోర్టుపై ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే... తీవ్రమైన నరాల బలహీనత ఏర్పడిందని, దీంతో ఎడమవైపు పాక్షిక వైకల్యం బారినపడే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారని తెలుస్తుంది!

కాగా... తెలంగాణలోని ఖమ్మం జిల్లా మామిళ్లగూడెం గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్‌ రాజ్.. ఇండియానాలో ఎంఎస్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో... అక్టోబరు 30న జిం నుంచి బయటకు వస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలై రక్తపు మడుగులో పడి ఉన్న వరుణ్‌ ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.