Begin typing your search above and press return to search.

అమెరికాలో భారత టెకీలకు ఇదో పీడకల?

అమెరికా చేరుకోవడం, ఉన్నత చదువులు పూర్తి చేయడం, తరువాత అక్కడే ఉద్యోగం పొందడం.. ఇది ఎన్నో భారతీయుల కల.

By:  Tupaki Desk   |   4 May 2025 9:00 PM IST
The U.S. Job Market for OPT Students
X

అమెరికా చేరుకోవడం, ఉన్నత చదువులు పూర్తి చేయడం, తరువాత అక్కడే ఉద్యోగం పొందడం.. ఇది ఎన్నో భారతీయుల కల. అయితే, ఈ కల వెనక ఉన్న సవాళ్లు తెలుసుకున్నప్పుడు చాలా మంది షాక్ అవుతారు. ముఖ్యంగా ఓపీటీ (Optional Practical Training) ఫేజ్‌లో ఉన్న విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయి.

- ఒక సాధారణ భారత టెకీ కథ

2022లో మాస్టర్స్ పూర్తి చేసిన ఒక భారతీయ డేటా ఇంజనీర్ అమెరికాలో తనకు అనుకూలమైన ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్నాడు. మూడు సంవత్సరాలుగా అతను భారతదేశంలో ఉన్న తన స్థిరమైన ఉద్యోగాన్ని వదిలేసి అమెరికాకు వెళ్లాడు, పెద్ద ఆశలతో పోరాడుతున్నాడు. కానీ వాస్తవం ఏమిటంటే, మాస్టర్స్ తరువాత OPT వర్క్ పర్మిట్‌ పీరియడ్‌లో ఉద్యోగం పొందడం అంత సులభం కాదు. అదే ఇబ్బందితో తాజాగా బాధపడుతున్నాడు.

ఒక సంవత్సరం పాటు ప్రయత్నించిన తర్వాత కూడా అతనికి ఎదురవుతున్నది కేవలం తిరస్కరణలే. రెజ్యూమెలు పంపడం, ఇంటర్వ్యూలకు హాజరు కావడం, నెట్‌వర్కింగ్ చేయడం.. ఇవన్నీ చేశాడు. కానీ ప్రతి సారి అదే సమస్య ఎదురవుతుంది. కంపెనీకి స్పాన్సర్‌షిప్ ఇవ్వాలా అనే ప్రశ్న. ఎక్కువ కంపెనీలు దీనిని మానసికంగా బరువుగా తీసుకుంటాయి. ఎందుకంటే వీసా స్పాన్సర్‌షిప్ అంటే వ్యయ భారం, లీగల్ సవాళ్లు.

- ఇది నేరమా?

“ఈ సమయంలో OPT/STEM‌లో ఉండటం నేరంలా అనిపిస్తుంది,” అని ఆ విద్యార్థి ఆన్‌లైన్‌లో వాపోయాడు. ఇది ఒక్క అతనికే కాదు.. ఎందరో అంతర్జాతీయ విద్యార్థులు అదే గాథ పంచుకుంటున్నారు. ఒకరు తాము OPT గడువు ముగియడానికి ఐదు రోజుల ముందు ఉద్యోగం సంపాదించగలిగామని చెప్పగా, మరొకరు ఆ అవకాశమూ కోల్పోయి, భారత్ తిరిగిపోవాల్సి వచ్చింది.

ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే.. అమెరికన్ ఎకనామీ, ఉద్యోగ మార్కెట్ అంతర్జాతీయ విద్యార్థులకు ఎంత వరకు సౌకర్యవంతమో అన్నది. హద్దులు, లీగల్ పరిమితులు, ఆర్థిక భారం ఇవన్నీ కలసి వారి అవకాశాలను తగ్గిస్తున్నాయి.

- అద్భుతాలపై ఆధారపడకండి

చివరి నిమిషంలో అద్భుతం జరగడం ఒక వింత. కానీ అది సరైన ప్లాన్ కాదు. అమెరికన్ డ్రీమ్ కోసం మీ స్థిరమైన జీవితాన్ని, ఉద్యోగాన్ని వదిలేయడం చాలా రిస్క్. ప్రతీ దశలో ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. అమెరికాకు రావాలంటే ముందే పరిశోధన చేయాలి: ఏ రంగాల్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి? OPT తరువాత స్పాన్సర్‌షిప్ అవకాశాలు ఎలా ఉంటాయి? కంపెనీలతో ముందు నుంచే నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాలి.

అమెరికన్ డ్రీమ్ వెనక ఉన్న వాస్తవం తెలుసుకోవడం చాలా అవసరం. అది సులభంగా “అమెరికన్ పీడకల” అయ్యే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ విద్యార్థులుగా ఉండే వారికీ, దేశంలో ఉద్యోగాలే దొరకని పరిస్థితుల్లో అసలు దిశ ఏమిటో ముందే ఆలోచించడం ముఖ్యమైనది. కలలు కంటే యథార్థం ముందు చూసి, ప్లాన్‌తో ముందుకు వెళ్ళడమే దీర్ఘకాల విజయానికి మార్గం.