ఇలాంటి ఎమోషనల్ క్షణం గర్భిణిగా..!

Tue Jan 18 2022 10:47:06 GMT+0530 (India Standard Time)

yashoda movie Latest Update

గర్భిణి స్త్రీ పాత్రలో కనిపించడం అంటే ఆషామాషీనా? అందుకు తగ్గట్టు ఆహార్యం కుదరాలి. ఇంతకుముందు వెండితెరపై శ్రీదేవి- వాణిశ్రీ సౌందర్య- రమ్యకృష్ణ పోషించినంతగా ఆ తర్వాత ఈ తరహా ప్రయోగాత్మక పాత్రల్లో ఎవరూ రాణించింది లేదు. ఇటీవలి కాలంలో ఈ తరహా పాత్రలు కూడా రచయితలు డిజైన్ చేయడం లేదు. చాలా రేర్ గా మాత్రమే ప్రయోగాలకు వెళుతున్నారు.ఇంతకుముందు కహానీ హిందీ చిత్రంలో విద్యాబాలన్ గర్భిణిగా నటించి ప్రశంసలు దక్కించుకున్నారు. కహానీ సౌత్ రీమేక్ అనామికలో నటించిన నయనతారకు మంచి పేరొచ్చింది. మిస్సయిన భర్తను వెతికే భార్యలుగా విద్యా.. నయన్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు.

ఇప్పుడు సమంత కూడా గర్భిణీ పాత్రలో నటించనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా పాన్-ఇండియా చిత్రం యశోద ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్న సమంత నెల రోజుల క్రితం హైదరాబాద్ లో లాంచింగ్ షెడ్యూల్ తో షూటింగ్ ప్రారంభించింది. తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో సామ్ గర్భిణీ స్త్రీ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఇంతకుముందు సామ్ నర్సు పాత్రను పోషిస్తున్నట్లు కథనాలు వచ్చినా కానీ ఇప్పుడు గర్భిణిగా ప్రయోగం చేస్తోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామానాయుడు స్టూడియోలో ప్రత్యేకంగా నిర్మించిన ఆసుపత్రి సెట్ లో సామ్ పై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించగా .. నర్సు అయిన గర్భిణీ పాత్రలో సమంత నటిస్తోందా? అంటూ గుసగుస వినిపిస్తోంది.

చైతన్య నుంచి విడిపోతున్న క్రమంలో సమంతకు గర్భిణి పాత్ర దక్కడం అన్నది యాధృచ్ఛికమే అయినా కానీ ఇది ఎంతో ఎమోషనల్ గా అభిమానులకు కనెక్టయ్యే వీలుందని విశ్లేషిస్తున్నారు. చైతో బిడ్డను కనాలని నిర్ణయించుకున్న సామ్ నుంచి ఊహించని ప్రకటనతో అంతా షాకయ్యారు. ఇప్పుడు పెద్ద తెరపై గర్భిణి పాత్రలో నటిస్తూ షాకివ్వనుంది. యశోద పాత్రలో నటి తన వ్యక్తిగత సంక్షోభంతో ఉన్న సారూప్యత కారణంగా ఖచ్చితంగా చాలా ఊహాగానాలు అంచనాలు ఉంటాయి. మరి దీనికి అధికారిక కన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బేబీ బంప్ తో ఉన్న సామ్ ను చూడాలన్న ఉత్సాహం అభిమానులకు ఉంది. అయితే దానిని ఎంతో బ్యాలెన్సింగ్ గా చేయాల్సి ఉంటుంది.

యశోద చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు. తన పాత్ర సమంత పాత్రతో సమానంగా ఉంటుందట. ఈ చిత్రం 2022 వేసవిలో తెలుగు- తమిళం- మలయాళం- కన్నడ- హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఆదిత్య 369- సమ్మోహనం వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.