చై అఖిల్ ఓకే.. కింగ్ నుంచి కౌంటర్ రాలేదే!

Tue Jan 24 2023 18:59:52 GMT+0530 (India Standard Time)

why nagarjuna not responding balakrishna comments

నందమూరి బాలకృష్ణ రీసెంట్ గా జరిగిన `వీర సింహారెడ్డి` విజయోత్సవం సాక్షిగా అక్కినేనిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదలైన `వీర సింహారెడ్డి` ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే యావరేజ్ టాక్ ని దక్కించుకుంది. అయితే వసూళ్ల పరంగా బాలయ్య కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిని బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో `వీర సింహారెడ్డి` విజయోత్సవాన్ని ఏర్పాటు చేసింది.చాలా రోజుల తరువాత చేసిన ఫ్యాక్షన్ డ్రామా కావడం...`అఖండ` తరువాత అదే స్థాయిలో సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో బాలయ్య ఖుషీ అవుతున్నాడు. ఆ ఆనందంలో వున్న బాలకృష్ణ విజయోత్సవ వేడుకలో మాట్లాడుతూ ఆరోజుల్లో మీ నాన్నగారి గురించి.. ఆ రంగారావు..ఈ రంగారావు.. అక్కినేని తొక్కినేని` అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బాలయ్య ఈ వ్యాఖ్యలు తెలిసి చేశారా?  తెలియక చేశారా?.. లేక ఫ్లోలో వచ్చేశాయా? లేక కావాలనే టంగ్ స్లిప్పయ్యారా? అనే చర్చ నడుస్తోంది.

బాలయ్య వ్యాఖ్యలపై నెటిజన్ లు నెట్టంటి విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. ఆ వెంటనే అక్కినేని నాగార్జున వారసులు అఖ్కినేని నాగచైతన్య అఖిల్ అక్కినేని .. బాలయ్య చేసిన వ్యాఖ్యల పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓ విధంగా చెప్పాంటే సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు కౌంటర్ ఇచ్చేశారు. `నందమూరి తారకరామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు ఎస్వీ రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరపరచడం మనల్ని మనమే కించపరుచుకోవడం` అంటూ నాగచైతన్య అఖిల్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇచ్చారు.

ఇదిలా వుంటే ఆలిండియా అక్కినేని ఫ్యాన్స్ అసోషియేషన్ రంగంలోకి దిగింది. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలకృష్ణ తను చేసిన వ్యాఖ్యలపై అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని మండిపడింది. అక్కినేనిపై బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధకరమన్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీని అవమానించినట్టేనన్నారు. ఈ నేపథ్యంలో కింగ్ నాగార్జున స్పందించలేదేంటనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.

బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగచైతన్య అఖిల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు కానీ నాగార్జున మాత్రం రియాక్ట్ కాలేదు ఎందుకనే చర్చ జరుగుతోంది. నాగ్ ఈ విషయంలో ఎందుకు మౌనంగా వున్నారు?.. తన నేరుగా స్పందిస్తే వివాదం పెద్దదవుతుందనా? .. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.