విశ్వక్ సేన్ గామి కూడా వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

Mon Mar 20 2023 23:00:01 GMT+0530 (India Standard Time)

vishwak sen gives update about gaami release time

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న దాస్ కా ధమ్కీ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మార్చి 22వ తేదీన ఉగాది సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నివేదా పేతురాజ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా ఒక యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కింది. ఈ సినిమాకి స్వయంగా విశ్వక్ సేన్ దర్శకత్వం వహించాడు. దీనితో సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా గట్టిగా చేస్తున్న విశ్వక్ సేన్ ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా తాము హీరోగా నటించిన గామి సినిమాకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.విశ్వక్ సేన్ తాజాగా తిరుమల శ్రీవారిని కాలినడకన కొండెక్కి మరీ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విశ్వక్ సేన్ తాను హీరోగా నటించిన గామి సినిమా గురించి ఓపెన్ అయ్యారు. ఆయన ఈ సినిమా గురించి మాట్లాడుతూ... సినిమా మరో రెండు నెలల్లో విడుదల కాబోతోందని తెలిపారు. అంటే సమ్మర్లో ఈసారి ప్రేక్షకులను తన గామి సినిమా పలకరించబోతుందని వెల్లడించారు.

ఇక ఈ గామి సినిమాలో విశ్వక్ సేన్ ఒక అఘోర పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశ్వక్ సేన్తో పాటు చాందినీ చౌదరి అభినయ దయానంద రెడ్డి హారిక వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీ సెల్యూలాయిడ్ సమర్పణలో కార్తీక్ శబరీష్ నిర్మిస్తున్నారు.

ఇక వరుస సినిమాలతో దూసుకుపోతున్న విశ్వక్సేన్ 20వ సినిమా నిన్న అధికారికంగా లాంచ్ అయింది. రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి రామ్ తాళ్లూరి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.  మీనాక్షి చౌదరి హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద విశ్వక్ హీరోగా నటించిన గామి సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవ్వబోతు ఉండడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అఘోరాగా విశ్వక్ సేన్ యాక్షన్ ఎలా ఉంటుందని వారందరూ అంచనాలు వేసుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.