విశ్వక్ లైనప్.. సితారతో పెద్ద ప్లానే..

Tue Mar 21 2023 08:00:01 GMT+0530 (India Standard Time)

vishwak sen VT10 sithara entertainments

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ హీరోగా కొనసాగుతున్నాడు. అతను నటించిన దమ్కీ మూవీ మార్చి 22న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా అతని స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కింది. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై విశ్వక్ చాలా నమ్మకంతో ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో ఎలాంటి క్యారెక్టర్ కి అయిన సెట్ అయ్యే హీరోగా విశ్వక్ ఉన్నాడని చెప్పాలి.ఆయన సినిమాల ఎంపిక చూసుకుంటేనే నటుడిగా విశ్వక్ పెర్ఫార్మెన్స్ రేంజ్ ఏంటో అనేది చెప్పొచ్చు. ఇదిలా ఉంటే దమ్కీ రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగానే మరో సినిమాకిగా తాజాగా ఈ యంగ్ హీరో కొబ్బరికాయ కొట్టడం విశేషం. జూనియర్ ఎన్టీఆర్ చెప్పినట్లు యువ దర్శకులతోనే ఎక్కువగా విశ్వక్ సినిమాలు చేస్తూ ఉండటం విశేషం. బడా నిర్మాత రామ్ తళ్లూరి నిర్మాణంలో తెరకెక్కబోయే ఈ మూవీతో రవితేజ ముళ్ళపూడి దర్శకుడిగా పరిచయం అవుతూ ఉండటం విశేషం.

ఈ సినిమా విశ్వక్ సేన్ 10వ సినిమాగా తెరకెక్కబోతుంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుంది అని ఒక పోస్టర్ ద్వారా నిర్మాత రామ్ తళ్లూరి ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేశారు. దీనికంటే ముందుగా విశ్వక్ సేన్ 9వ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరపైకి తీసుకు వస్తున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కబోతుంది. పాటల రచయితగా కెరీర్ స్టార్ట్ చేసి రౌడి ఫెలో అనంతరం చల్ మోహన్ రంగ సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నాడు

ఇక విశ్వక్ సేన్ కెరిర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ఇది రాబోతుంది. ఈ సినిమాని డిఫరెంట్ కథాంశంతో సిద్ధం చేయబోతున్నట్లు తెలుస్తుంది. త్వరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. ఒకవైపు VT 10 ను కొనసాగిస్తూనే మరోవైపు పార్లర్ గా ఈ సినిమా షూటింగ్ కూడా ఫినిష్ చేయనున్నాడట. మొత్తానికి విశ్వక్ సేన్ కెరియర్ లో సినిమా సినిమాకి వేరియేషన్ చూపిస్తూ నటుడిగా తనని తాను గ్రాండ్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక రాబోయే సినిమాలు అంతకుమించి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.