వైరల్ వీడియోః షూటింగ్ లో స్టార్ హీరోకు తీవ్రగాయాలు

Wed Jul 21 2021 15:33:37 GMT+0530 (IST)

Vishal injured in new movie shooting

తమిళ్ స్టార్ హీరో విశాల్ సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడ్డారు. గతంలో ఓ సారి ఫైట్ సీన్ చిత్రీకరణలో గాయపడ్డిన విశాల్.. ఇప్పుడు కూడా యాక్షన్ సన్నివేశం చిత్రీకరించే సమయంలోనే గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే సినిమా చేస్తున్నాడు విశాల్. శరవణన్ డైరెక్షన్లో నటిస్తున్న ఈ మూవీ.. కరోనా విరామం తర్వాత షూటింగ్ జరుపుకుంటోంది.ఈ చిత్రం షూటింగ్ తుదిదశకు చేరుకుంది. క్లైమాక్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్ షూట్ చేస్తున్నారు. భారీ యాక్షన్ సీన్ కండక్ట్ చేస్తున్న దర్శకుడు.. భారీ సెట్ ఏర్పాటు చేశారు. ఫైట్ మాస్టర్ గూస్ బంస్ అయ్యే స్టంట్లు కంపోజ్ చేశారు. అయితే.. ఇందులో ఒక స్టంట్ చేసే క్రమంలో అంచనా మిస్సవడంతో.. విశాల్ గాయపడ్డారు.

విలన్ బలంగా విసిరికొట్టడంతో.. వెళ్లి గోడకు బలంగా తాకాడు విశాల్. దీంతో.. వెన్నుకు దెబ్బ తగలడంతో హీరో అక్కడే పడిపోయాడు. వెంటనే స్పందించిన చిత్ర యూనిట్ షూటింగ్ ను అర్ధంతరంగా నిలిపేసి.. విశాల్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో విశాల్ వెన్నుకు కాస్త బలమైన దెబ్బే తగిలినట్టు యూనిట్ సమాచారం.

కాగా.. గతంలోనూ విశాల్ కు ఇదేవిధంగా గాయపడ్డాడు. ఫైట్ సీన్ లో నటుల మధ్య కో-ఆర్డినేషన్ మిస్ మ్యాచ్ కావడంతో.. విశాల్ తలకు కన్ను ప్రాంతంలో గాయాలయ్యాయి. ఇప్పుడు మరోసారి గాయపడడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసి ఆగస్టులో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.