Begin typing your search above and press return to search.

సాయి పల్లవిని 'ఫిదా' చేసిన గ్రామస్తులు

By:  Tupaki Desk   |   23 Sep 2021 6:31 AM GMT
సాయి పల్లవిని ఫిదా చేసిన గ్రామస్తులు
X
టాలీవుడ్‌ లో ప్రస్తుతం సాయి పల్లవి పేరు మారు మ్రోగిపోతుంది. లవ్‌ స్టోరీ సినిమా తో సెకండ్ వేవ్ తర్వాత సాయి పల్లవి థియేటర్ల ద్వారా వచ్చేందుకు సిద్దం అయ్యింది. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన లవ్ స్టోరీ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సినిమా చిత్రీకరణ ప్రారంభం అయినప్పటి నుండి ఇప్పటి వరకు సినిమా అదే రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. నాగచైతన్య మరియు సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీకి శేఖర్‌ కమ్ముల దర్శకత్వం మరింత ప్రధాన ఆకర్షణగా మారబోతుంది. సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి గత ఏడాది కాలంగా ఫుల్ హైప్ ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన గత చిత్రం ఫిదా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సాయి పల్లవిని స్టార్ ను చేసిన శేఖర్‌ కమ్ముల మళ్లీ లవ్ స్టోరీ అంటూ తెరకెక్కించిన నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. సాయి పల్లవి ని లవ్‌ స్టోరీ ట్రైలర్‌ లో చూస్తూ ఉంటే మళ్లీ ఫిదా చేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది. సాయి పల్లవి అందరిని ఫిదా చేస్తే.. ఆమెను గ్రామస్తులు ఫిదా చేశారట. తాజాగా ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

ఫిదా సినిమా కోసం బాన్సువాడ లో చాలా రోజులు చిత్రీకరణ చేశాం. ఆ సమయంలో చాలా మంది సన్నిహితంగా మాకు దగ్గర అయ్యారు. అక్కడ ఎంతో మంది ఆప్యాయంగా పలకరిస్తూ ఉండే వారు. ప్రతి ఒక్కరు కూడా షూటింగ్ కు సహకరించేవారు. ఇక లవ్ స్టోరీ కోసం ఆర్మూర్ దగ్గర పిప్రీలో చాలా రోజుల పాటు షూటింగ్ చేశాం. కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో అక్కడ షూటింగ్ చేయడం జరిగింది. ఆ సమయంలో రాత్రి సమయంలో షూటింగ్ చేసినా కూడా ఎవరు ఏమీ ఇబ్బంది పెట్టలేదు. అక్కడి వారు హీరో హీరోయిన్‌ అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూడటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అక్కడ షూటింగ్ కు సహకరించారు. రాత్రి సమయంలో షూటింగ్ అంటే స్థానికుల నుండి సహజంగా అయితే ఇబ్బందులు ఉంటాయి. కాని వారు మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టలేదని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు కూడా మాతో సన్నిహితంగా వ్యవహరించారని వారి ప్రవర్తనకు తాను ఫిదా అయినట్లుగా చెప్పుకొచ్చింది.

సాయి పల్లవి దర్శకుడు శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ అలాంటి ఒక దర్శకుడిని నేను ఎప్పుడు చూడలేదు. చాలా సింపుల్‌ గా ఉంటారు. నేల మీద కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆయన చాలా సెన్సిటివ్‌ మరియు సింపుల్‌. ఆయన పద్దతి మరియు ప్రవర్తన చాలా విభిన్నంగా అనిపించేది. ఆయనతో రెండు సినిమాలు వర్క్ చేసిన నేను చాలా మారాను. నేను కూడా సింపుల్‌ జీవతాన్ని అలవాటు చేసుకున్నాను. సెన్సిటివ్ గా పలు విషయాల గురించి ఆలోచిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఆయన వర్కింగ్‌ స్టైల్‌ చాలా బాగుంటుంది. ఆయన నుండి ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు అంది. నాగచైతన్య కూడా శేఖర్ కమ్ముల సినిమాలో నటించడం అనేది యాక్టింగ్ స్కూల్‌ కు వెళ్లడం వంటిది అంటూ చెప్పుకొచ్చాడు.