Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ సినిమా.. హాలీవుడ్‌ మూవీకి రీమేక్‌?

By:  Tupaki Desk   |   28 Nov 2022 1:30 AM GMT
సూపర్ స్టార్‌ సినిమా.. హాలీవుడ్‌ మూవీకి రీమేక్‌?
X
తమిళ సూపర్ స్టార్ విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న వారసుడు అనే ద్విభాషా సినిమాని చేస్తున్న విషయం తెలిసిందే. సంక్రాంతికి వారసుడు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

విజయ్ ఎప్పుడు కూడా తన ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమా కు కమిట్ అవుతాడు. వెంటనే షూటింగ్ కార్యక్రమాలను కూడా మొదలు పెడతాడు. ఎప్పటిలాగే విజయ్ తన తదుపరి సినిమాని లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో చేసేందుకు ఓకే చెప్పాడు.

అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. లోకేష్ కనకరాజ్ సినిమా అనగానే అభిమానుల్లో ఒక అంచనా ఏర్పడుతుంది. కనుక ఈ సినిమా ఆ అంచనాలకు ఏమాత్రం తక్కువ కాకుండా ఉండాలనే ఉద్దేశంతో భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారట.

తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం హాలీవుడ్ చిత్రం వైలెన్స్ ఆఫ్ హిస్టరీ అనే సినిమాకి రీమేక్ గా విజయ్ సినిమా ను లోకేష్ కనగరాజ్ రూపొందించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఆ హాలీవుడ్ సినిమా యొక్క స్టోరీ లైన్ మాత్రమే తీసుకొని తమిళ మరియు ఇండియన్ సినీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా పూర్తిగా మార్పులు చేర్పులు చేసి ఆ తర్వాత తెరకెక్కించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

విజయ్ మరియు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో ఇప్పటికే వచ్చిన సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఈ సినిమా తో మరో విజయాన్ని ఈ కాంబినేషన్ సొంతం చేసుకుంటుందా అనేది చూడాలి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.