తమిళ నటుడు విజయ్ సేతుపతి కేవలం కోలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్.. బాలీవుడ్ ఇంకా ఇతర భాషల్లో కూడా వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. ఏడాదికి డజనుకు పైగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వివిధ భాషల సినిమాలతో వస్తున్న విజయ్ సేతుపతిని ఆయన అభిమానులు పాన్ ఇండియా స్టార్ అంటూ పిలుస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి ఇటీవల ఒక సందర్భంలో నన్ను కొందరు పాన్ ఇండియా స్టార్ అంటూ పిలవడం సౌకర్యంగా అనిపించడం లేదు. నేను కేవలం నటుడిని మాత్రమే. నేను అన్ని భాషల్లో నటించాలి అనుకునే ఒక సగటు నటుడిని.. నన్ను పాన్ ఇండియా నటుడు అనడం నచ్చడం లేదు అన్నాడు.
పాన్ ఇండియా నటుడు అంటూ నన్ను పిలిస్తే ఒత్తిడికి గురి అవుతున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. సినిమాల్లో నటించడం అనేది తన డ్యూటీ.. అది ఏ భాష అయినా కూడా ప్రేక్షకులను అలరించే విధంగా నటించాలి అనుకుంటాను అంటూ విజయ్ సేతుపతి చాలా వినమ్రంగా చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం చేస్తున్న భాషల్లోనే కాకుండా అవకాశం వస్తే భవిష్యత్తులో పంజాబీ.. మరాఠీ.. గుజరాతీ మరియు బెంగాలీ భాషల్లో కూడా నటించేందుకు గాను సిద్ధం అన్నట్లుగా విజయ్ సేతుపతి చెప్పాడు. అయినా కూడా తాను పాన్ ఇండియా నటుడిని కాదు.. నటుడినే అన్నాడు. నటుడు అనే పదానికి ఎలాంటి ట్యాగ్స్ తగిలించడం ఇష్టం లేదని పేర్కొన్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటే ఇదేనేమో కదా..!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.