హీరోయిన్ మూడవ పెళ్లి రచ్చ రచ్చ

Wed Jul 08 2020 15:21:18 GMT+0530 (IST)

vanitha vijaykumar third marriage

సౌత్ స్టార్ నటుడు విజయ్ కుమార్ కూతురు వనితా విజయ్ కుమార్ ఇటీవల మూడవ పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వివాదాస్పద నటిగా పేరు తెచ్చుకున్న వనిత మూడవ  పెళ్లి కూడా వివాదం అవుతోంది. ఆమె గతంలో పెళ్లి చేసుకున్న ఇద్దరికి విడాకులు ఇచ్చి గత నెలలో పీటర్ పాల్ ను వివాహం చేసుకుంది. పెళ్లి గురించి ప్రకటన వచ్చిన చాలా రోజుల తర్వాత వారి పెళ్లి అయ్యింది. పెళ్లి అయిన కొన్ని గంటలకే పీటర్ పాల్ మొదటి భార్య మీడియా ముందుకు వచ్చింది.పీటర్ తనకు విడాకులు ఇవ్వకుండానే మరో పెళ్లి చేసుకున్నాడు అంటూ ఆరోపించింది. పీటర్ విడాకుల విషయం వనితకు తెలుసా తెలియదా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఆమె తెలిసి కూడా పీటర్ ను పెళ్లి చేసుకుంటే తప్పు ఆమెది కూడా అవుతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఒక భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి చేసుకోవడం పీటర్ ది ఎంత తప్పో మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కూడా వనిత తప్పు ఉంటుందని సినీ ప్రముఖులు కూడా అన్నారు.

లేడీ డైరెక్టర్ లక్ష్మి రామకృష్ణన్ ఇంకా కుట్టి పద్మిని కూడా పీటర్ విడాకుల పక్రియ పూర్తి అయిన తర్వాత వనిత పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది అంటూ కామెంట్స్ చేశారు. వారి వ్యాఖ్యలపై వనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ పని మీరు చూసుకోండి అంటూ వనిత వ్యాఖ్యలు చేయడంతో వారిద్దరు కూడా వనితకు క్షమాపణలు చెప్పారు. మరి కొందరు మాత్రం ఇంకా వనితను టార్గెట్ చేసి విమర్శలు చేస్తూనే ఉన్నారు.