ఉత్తేజ్ కన్నీటి గాథ.. జీవితం మొత్తం కష్టాలే

Tue Sep 14 2021 19:00:11 GMT+0530 (IST)

uttej Life is full of hardships

సినిమా ఇండస్ట్రీలో ఉత్తేజ్ గురించి తెలియని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. ప్రతి ఒక్కరికి ఆప్తుడిగా మంచి పేరు దక్కించుకున్న ఉత్తేజ్ జీవితం మొత్తం కూడా స్ట్రగుల్స్ తోనే సాగింది అనడంలో సందేహం లేదు. చిన్న వయసులోనే సినిమాలపై మోజుతో ప్రయత్నాలు ప్రారంభించాడు. మొదట సహాయ దర్శకుడిగా పని చేసిన ఉత్తేజ్ ఆ తర్వాత రచయితగా నటుడిగా కూడా పేరు దక్కించుకున్నాడు. ఉత్తేజ్ కెరీర్ ఎప్పుడు కూడా పీక్స్ కు వెళ్లలేదు. ఆయన చాలా సినిమాల్లో కనిపించినా కూడా అవి చిన్న చిన్న పాత్రలే అవ్వడం వల్ల ఆఫర్ల కోసం వెదుక్కోవాల్సి వచ్చేది. సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి పేరు ఉంది కాని ఆయనకు తగ్గ ఆఫర్లు మాత్రం రాలేదు. దాంతో ఆయన ఆర్థికంగా ఎప్పుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉండే వారు. ఆయన జీవిత భాగస్వామి పద్మ ఆయనకు ఎంతో మద్దతుగా నిలిచేవారు. ఎన్నో కష్టాలను ఆయనతో కలిసి ఎదుర్కొన్నారు. ఇంట్లో సమస్యలు.. ఆర్థిక ఇబ్బందులు ఇలా అన్నింట కూడా ఆమె భాగస్వామిగా ఉండేది.ఆశ్చర్యకర విషయం ఏంటీ అంటే ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఉత్తేజ్ ఇప్పటి వరకు సొంత ఇంటి కల నెరవేర్చుకోలేక పోయాడు. ఇప్పుడిప్పుడు సొంత ఇంటి కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. అలాంటి ఉత్తేజ్ జీవితంలో కాస్త కుదుట పడ్డాడు. ఇక కష్టాలు లేవు అనుకుంటున్న సమయంలో ఆయన భార్య మృతి మొత్తం తలకిందులు చేసింది. ఇన్నేళ్ల కష్టం తన ఫిల్మ్ ఇన్సిట్యూట్ ద్వారా పోగొట్టుకున్న ఉత్తేజ్ కాస్త ఆర్థికంగా కుదుట పడ్డాడు. మెల్ల మెల్లగా మొత్తం కుదుట పడుతుంది.. ఇక భార్య పిల్లలతో జీవితం సంతోషంగా సాగించవచ్చు అనుకుంటూ ఉండగా పద్మ కు అనారోగ్య సమస్యలు మొదలు అయ్యాయి. ఆమె కోసం చాలా ఖర్చు పెట్టినా కూడా ఫలితం లేకుండా పోయింది.

పద్మ పై ఉత్తేజ్ కు అమితమైన ఆరాధన ప్రేమ భావం ఉంది. అందుకే ఆమె మృతిని ఉత్తేజ్ జీర్ణించుకోలేక పోయాడు. చిన్న పిల్లాడు మాదిరిగా ఏడ్వడం ప్రతి ఒక్కరిని కలచి వేసింది. పలువురు ఆయన్ను ఓదార్చేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. పద్మ మృతితో ఆ కుటుంబ సభ్యులు మొత్తం కూడా తీవ్ర దుఃఖంలో మునిగి పోయారు. ఇంటి దిక్కు కోల్పోయాం అంటూ ఉత్తేజ్ ఏడ్వడం చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని.. ఇంత త్వరగా వస్తుందని తాను ఊహించలేదు అంటూ ఉత్తేజ్ కన్నీరు మున్నీరు అయ్యారు. సమస్యలు అన్నీ తొలగి పోతున్నాయి అనుకుంటున్న సమయంలో పద్మ మృతి చెందడం జీవితంలో కోలుకోలేని దెబ్బ అని ఉత్తేజ్ సన్నిహితుల అంటున్నారు.