Begin typing your search above and press return to search.

ఉర్ఫీ జావేద్.. ముందు ప్యాంట్, వెనక బికినీ!

By:  Tupaki Desk   |   6 Feb 2023 6:14 PM GMT
ఉర్ఫీ జావేద్.. ముందు ప్యాంట్, వెనక బికినీ!
X
బాలీవుడ్ లో సోషల్ మీడియా సెన్సేషన్ గా తనకంటూ ప్రత్యేకమైన యూనిట్ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్న నాటి ఉర్ఫీ జావెద్. బిగ్ బాస్ రియాల్టీ షో తో పాపులర్ అయిన ఈ బ్యూటీ సీరియల్స్ ద్వారా నటిగా కెరియర్ ప్రారంభించింది. తర్వాత హిందీ బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే బిగ్ బాస్ కంటే ఎక్కువగా ఉర్ఫీ జావేద్ బాగా గుర్తింపు తీసుకొచ్చింది మాత్రం ఆమె విచిత్ర వేషధారణ చెప్పాలి. హీరోయిన్స్ ఎవరైనా అందాల ప్రదర్శన కోసం కాస్త గ్లామర్ కాస్ట్యూమ్స్ వేసుకోవడం అనేది కామన్ గా జరుగుతుంది.

అయితే ఈ బ్యూటీ మాత్రం అందాల ప్రదర్శన చాలా విచిత్రంగా చేస్తుంది. తనకి ఏం దొరికితే దానిని కాస్ట్యూమ్ గా మార్చేసుకుంటుంది. విచిత్రమైన కాస్ట్యూమ్స్ తో సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేస్తూ ఉంటుంది. ఇక ఈ బ్యూటీ వేసే విచిత్రమైన విన్యాసాలకి ఇన్స్టాగ్రామ్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడు ఎలాంటి డ్రెస్ వేస్తుందో అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక ఆమె వేసే కాస్ట్యూమ్స్ కూడా లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఇక ఊర్ఫీ జావేద్ వేసే కాస్ట్యూమ్స్ కి ఏ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారో అదే స్థాయిలో ద్వేషించేవారు కూడా ఉన్నారు.

ఆమె వస్త్రధారణను అసహ్యించుకుంటూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు కూడా పెడుతూ ఉంటారు. అయితే ఎవరిని లెక్క చేయకుండా తాను ఎలా ఉండాలని అనుకుంటుందో అలాగే ఉంటుంది. కేవలం ఫోటో షూట్ ల వరకు మాత్రమే కాకుండా బయటికి ఫంక్షన్స్ కి వచ్చే సమయంలో కూడా ఆమె వస్త్రధారణ చాలా వెరైటీగా ఉంటుంది.

ఒళ్లంతా కనిపించే విధంగా నగ్నత్వాన్ని ప్రదర్శిస్తూ కేవలం రోడ్డుమీద ధైర్యంగా తిరిగేస్తూ ఉంటుంది. సినిమాలో ఈ బ్యూటీకి అవకాశాలు తక్కువగానే ఉన్న సోషల్ మీడియాలో మాత్రం విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ మధ్య కాలంలో ఆమె వస్త్రధారణ కారణంగా ముంబైలో ఎవరు ఇల్లు కూడా అద్దెకు ఇవ్వడం లేదని వాపోయింది. ఇదేలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ మరో ఆసక్తికరమైన కాస్ట్యూమ్స్ తో దర్శనం ఇచ్చింది. హోటల్లో సర్వర్ చేసుకునే వైట్ అండ్ బ్లాక్ ఫుల్ డ్రెస్ లో కనిపించి షాక్ ఇచ్చింది.

అయితే ఈ డ్రెస్సు చూసిన తర్వాత ఉర్ఫీ జావేద్ ఇంత నిండుగా కూడా బట్టలు వేసుకుంటుందా అని ఆశ్చర్యపోయే వాళ్ళు ఉన్నారు. అయితే ఆ ఫోటోలో అద్దంలో ఆమె అసలు రూపం కనిపిస్తుంది. ముందు నిండుగా కప్పుకున్న వెనక్కి పూర్తిగా వదిలేసింది. ఈ ఫోటో చూసిన తర్వాత కుర్ఫీ జావిద్ క్రియేటివిటీకి నిజంగా ప్రతి ఒక్కరు హాట్సాఫ్ చెప్తున్నారు. ఏది ఏమైనా తన కాస్ట్యూమ్స్ తో బాలీవుడ్ లో సెన్సియేషన్ గా ఉర్ఫీ జావేద్ మారిపోయి తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవడం గొప్ప విషయం అని చెప్పాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.