ఉపాసన స్పెషల్ లగ్జరీ కార్ కొనుగోలు

Wed May 25 2022 08:46:55 GMT+0530 (IST)

upasana news Audi car

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య.. మెగా కోడలు ఉపాసన కొణిదెల ఆడి ఈ ట్రాన్ ని కొనుగోలు చేశారు. ఈ వార్తను ఉపాసన స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసారు. ``నా కోసం.. భవిష్యత్తు స్థిరత్వం... ప్రగతిశీలతను దృష్టిలో ఉంచుకున్నాను.నా ఆడి ఇ-ట్రాన్ నాకు రెండింటినీ ఇస్తుంది. ఆడి ఇ-ట్రాన్ అత్యాధునిక ఆవిష్కరణతో సౌకర్యం  స్థిరత్వం అనుభవించగలము. ఇది నిజంగా నా ప్రయాణాలన్నింటిలో స్థిరంగా తోడుగా ఉంటుంది`` అని అన్నారు.
 
ఉపాసనకు నెటిజనులు అభినందనలు తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు. ఆమె అభిమాని ఒకరు ఇలా వ్యాఖ్యానించారు.  శుభాకాంక్షలు నచ్చిన జీవితాన్ని ఆనందించండి.. అని ఒకరు వ్యాఖ్యానించగా.. మరొక అభిమాని స్పందిస్తూ.. అభినందనలు.. మంచి కారు.. చాలా బాగుంది.

ఉపాసన బ్రహ్మాండమైన ఆలోచనను కలిగి ఉన్నారు. మీరు అద్భుతం... అని ప్రశంసించారు. మరొక నెటిజన్ ఇలా వ్రాశాడు. ``అది చూసి సంతోషిస్తున్నాము.. సురక్షితమైన ప్రయాణంతో ముందుకు సాగండి`` అని విష్ చేసారు.

ఉపాసన అపోలో లైఫ్ వైస్ చైర్ పర్సన్ .. బి పాజిటివ్ మ్యాగజైన్ కి ఎడిటర్-ఇన్-చీఫ్ .. గొప్ప పారిశ్రామికవేత్త. రామ్ చరణ్ కెరీర్ ఆద్యంతం సతీమణిగా ఉపాసన సహకారం కొనసాగుతోంది. ఈ జంట విహారయాత్రలు ప్రతిసారీ అభిమానుల్లో చర్చకు వస్తుంటాయి.

రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ తో కలిసి ఆర్.సి 15 చిత్రం కోసం పనిచేస్తున్నాడు. వినయ విధేయ రామ తర్వాత కియారా అద్వానీ అతడి సరసన మరోసారి నటిస్తోంది. తదుపరి కేజీఎఫ్ దర్శకుడితోనూ చరణ్ ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.