మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని ఆయన సతీమణి ఉపాసపన ముద్దుగా `మిస్టర్ సీ` అని పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. చరణ్ అనడం చాలా రేర్. మిస్టర్ సీ అనే ఎక్కువగా సంబోధిస్తుంటారు. ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎక్కువగా మిస్టర్ సీ అనే కనిపిస్తుంటుంది. భర్త కాబట్టి ఆమె ముద్దుగా అలా పిలుచుకుంటున్నారన్నది అందరి అభిప్రాయం. కానీ దాని వెనుక చాలా కథే ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
`మిస్టర్ సీ` అంటే మిస్టర్ చరణ్ అనే చాలా మంది అనుకుంటున్నారు. కానీ మిస్టర్ సీ చాలా కహానీనే ఉందని తెలుస్తోంది. మిస్టర్ సీ అనేది అమెరికాలోని లాస్ ఎంజెల్స్ లో ఉన్న ఓ ఫేమస్ హోల్ పేరుట. చరణ్-ఉపాసన ఎప్పుడు లాస్ ఎంజెల్స్ కి వెళ్లినా అదే హోటల్ కి వెళ్తుంటారు. ఆ హోటల్ యజమాని..షెప్ అయిన అతని పేరు చిప్రీయానీ. అక్కడ ఆహారం ఎంతో రుచికరంగా ఉంటుందిట.
ప్రతీ వంటకం ఎంతో ప్రత్యేకంగా ఉంటుందిట. అక్కడ రుచి మరిగితే మళ్లీ మళ్లీ వెళ్లాలనినిపంచేలా ఉంటుంది. ఆ రకంగా చరణ్కి ఆహోటల్ని ఉపాసన బాగా అలవాటు చేసారుట. ఆ హోటల్ వాతావరణం...చుట్టు ప్రక్కల వెదర్ ఇంకా అందంగా ఉంటాయట. ఇవన్నీ ఉపాసనని ఎంతగానో ఆకట్టుకున్నాయట. అందుకే చరణ్ కి మిస్టర్ సి అని నిక్ నేమ్ పెట్టి ముద్దుగా పిలుచుకుంటారుట.
అదీ మిస్టర్ సీ వెనుక ఉన్న కహానీ. ఇక మెగాపవర్ స్టార్ కెరీర్ సంగతి చూస్తే... రామ్ చరణ్ ఇమేజ్ ఇప్పుడు హాలీవుడ్ నే తాకింది. ఇటీవల `ఆర్ ఆర్ ఆర్` కి దక్కిన ఆస్కార్ గుర్తింపుతో! ఆ క్రేజ్ రెట్టింపు అయింది. ఆయన ఎస్? చెప్పాలేగానీ సినిమాలు చేయడానికి హాలీవుడ్ మేకర్స్ సైతం రెడీ గా ఉన్నారు. కొత్తగా మరిన్నిప్రయోగాలు చేయాలని చరణ్ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. కమర్శియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ యూనిక్ అంశాలతో సినిమాలు చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయిన వెంటనే `ఉప్పెన` ఫేం బుచ్చిబాబు సాన చిత్రాన్ని చరణ్ పట్టాలెక్కించనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.