విశ్వనటుడు కమల్ హాసన్ సరికొత్త వ్యాపారం

Thu Oct 21 2021 13:32:04 GMT+0530 (India Standard Time)

universalstar Kamal Haasan new business

విశ్వనటుడు.. దర్శకనిర్మాత కమల్ హాసన్ ఆల్ రౌండర నైపుణ్యం గురించి పరిచయం అవసరం లేదు. నటుడు దర్శకుడు నిర్మాత గాయకుడు సంగీతజ్ఞుడు.. క్లాసిక్ డ్యాన్సర్.. ఇలా ఎన్నో కళల్ని కలిగి ఉన్న ఏకైక స్టార్ అతడు. ఇప్పుడు కమల్ ఫ్యాషన్ వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. కమల్ తన ఫ్యాషన్ లేబుల్ `హౌస్ ఆఫ్ ఖద్దర్` ను నవంబర్ లో ప్రారంభించనున్నారు. అమెరికా- చికాగోలో హౌస్ ఆఫ్ ఖద్దర్  మొదటి స్టోర్ ను ప్రారంభించడం ద్వారా భారతీయ చేనేత ప్రాశస్త్యాన్ని విదేశాలకు విస్తరిస్తున్నారు. చేనేత దుస్తులు సహా  ఉపకరణాలకు గ్లోబల్ ప్లాట్ ఫారమ్ ఇవ్వాలని కమల్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ అమృత రామ్ ఈ దుస్తులను రూపొందించారు.గర్వించదగిన విషయం ఏమంటే.. భారతదేశం కోసం ప్రపంచ రాజకీయ చరిత్రలో ప్రభావవంతమైన లిఖితమైన ఒక ఉత్పత్తిని మేం ఎంచుకున్నాం. ఖాదీ మన చరిత్రతో చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంది. ఈ ఉత్పత్తిని వ్యాపారం చేయగలుగుతున్నందుకు గర్వపడుతున్నాము. చక్కని సౌకర్యం దృక్కోణంలో ఖాది అనేది అన్ని వాతావరణాలకు అనుకూలమైన వస్త్రాలు. ఇది వేసవిలో ఎంతో చల్లదనాన్నిచ్చి చెమటను పీల్చే వస్త్రం. ఖాదీని పట్టణ మార్కెట్కి సంబంధించినదిగా మార్చడం .. ఈ అందమైన కళను సృష్టించే చేనేత కార్మికులు కళాకారులను బాగు చేసే ప్రయత్నం చేస్తాం`` అని కమల్ ప్రకటించారు.

సినీకెరీర్ పరంగా కమల్ భారతీయుడు 2ని తిరిగి ప్రారంభించాల్సి ఉంది. ప్రస్తుతం బుల్లితెర షో `బిగ్ బాస్- తమిళం`  5వ సీజన్ కు హోస్ట్ గా ఉన్నారు. అతను ఏకకాలంలో మోస్ట్ అవైటెడ్ మల్టీస్టారర్ `విక్రమ్` ని నిర్మిస్తున్నారు. చియాన్ విక్రమ్- కమల్ హాసన్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో విజయ్ సేతుపతి - ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.