Begin typing your search above and press return to search.

‘పుష్ప’ టైటిల్ మారబోతోందటగా?

By:  Tupaki Desk   |   19 Jun 2021 9:31 AM GMT
‘పుష్ప’ టైటిల్ మారబోతోందటగా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ 'పుష్ప'. గంధ‌పు చెక్క‌ల‌ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ సినిమాలో.. బన్నీ సరసన ర‌ష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రిమూవీమేక‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికీ టీజ‌ర్ విడుద‌లై మంచి రెస్పాన్స్ అందుకుంది.

అయితే.. క‌రోనా క‌ష్టం అన్ని సినిమాల‌కు టైమ్ గ్యాప్ ఇస్తే.. 'పుష్ప‌' విషయంలో ఏకంగా డెస్టినేషనే మార్చేసింది. ఇప్పటి వరకు అయిన షూటింగ్ చాలా తక్కువకావడం.. షూట్ చేయాల్సింది ఎంతో ఉండ‌డంతో.. యూనిట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌నే ప్ర‌చారం సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీని రెండు భాగాలుగా రిలీజ్ చేయాని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. టైమ్ మ‌రీ ఎక్కువ‌గా అవుతుండడంతోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు టాక్‌.

లేటెస్ట్ అప్డేట్ ఏమంటే.. ఈ రెండు భాగాలు రెండు టైటిల్స్ తో రాబోతున్నాయ‌ని తెలుస్తోంది. సెకండ్ పార్ట్ కు కొత్త టైటిల్ ను సుకుమార్ ఆలోచిస్తున్నాడ‌న్న‌ది ఫిల్మ్ న‌గ‌ర్ టాక్. ఇక‌, రెండో విష‌యం విల‌న్ సెల‌క్ష‌న్. దాదాపు ఎనిమిది మంది విల‌న్లు ఉన్న ఈ సినిమాలో ఫ‌హ‌ద్ ఫాసిల్ ను మెయిన్ విల‌న్ గా ఎంచుకున్నారు. అయితే.. ఫ‌స్ట్ పార్ట్ లోనే ఫ‌హ‌ద్ క్యారెక్ట‌ర్ అంత‌మ‌వుతుంద‌ని భోగ‌ట్టా.

సెకండ్ పార్ట్ లో మోస్ట్ ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ అవ‌స‌రం ఉంటుంద‌ని, ఆ క్యారెక్ట‌ర్ కు స‌రిప‌డే న‌టుడిని వెతికే ప‌నిలో ఉన్నాడ‌ట సుకుమార్. బ‌న్నీ కెరీర్లోనే తొలి పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని.. లేటైనా లేటెస్ట్ గా రిలీజ్ చేయాల‌ని చూస్తున్నాడు సుక్కూ. మ‌రి ఈ సాలిడ్ మూవీ ఎప్పుడు వ‌స్తుంది? ఎలాంటి కిక్ ఇస్తుంద‌న్న‌ది చూడాలి.