Begin typing your search above and press return to search.

సుమ దంపతుల కొత్త ఇల్లుపై ట్రోల్స్‌

By:  Tupaki Desk   |   27 Feb 2020 6:12 AM GMT
సుమ దంపతుల కొత్త ఇల్లుపై ట్రోల్స్‌
X
తెలుగులో యాంకర్‌.. హోస్ట్‌ అనే పదాలు వినిపించిన వెంటనే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు సుమ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్కో షోకు లక్షలు కురిపిస్తూ సుమతో యాంకరింగ్‌ చేయిస్తూ ఉన్నారు. ఇక స్టార్‌ హీరోల నుండి చిన్న హీరోల సినిమాల వేడుకల వరకు అందరు కూడా సుమ యాంకర్‌ గా కావాలని కోరుకుంటూ ఉంటారు. సుమ హోస్టింగ్‌ చేస్తే ఆ కార్యక్రమం క్రేజ్‌ పెరిగి పోతుంది. అందుకే సుమను యాంకర్‌ గా అంతా కావాలనుకుంటారు.

ప్రస్తుతం రెండు కాదు అంతకు మించిన చేతులతో సంపాదిస్తున్న సుమ హైదరాబాద్‌ లో ఒక ఖరీదైన లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నారట. మూడు నెలల క్రితమే ఈ ఇల్లు పూర్తి అయ్యిందని కాని రాజీవ్‌ కనకాల తండ్రి మృతి చెందడంతో గృహ ప్రవేశం ఆగిందని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. ఇక ఆలస్యం చేయకుండా సుమ దంపతులు కొత్త ఇంట్లోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేయిస్తున్నారట.

ప్రస్తుతం ఉంటున్న ఇంటి విషయంలో చాలా రోజులుగా సుమ దంపతులు మరియు పిల్లలు అసంతృప్తితో ఉన్నారట. దాంతో తమ అభిరుచులకు అనుగుణంగా కొత్త ఇంటిని నిర్మించుకున్నారట. స్టార్‌ హీరోల ఇళ్ల రేంజ్‌ లో సుమ ఇళ్లు నిర్మాణం ఉందని చూసిన వారు అంటున్నారు. సుమ గృహ ప్రవేశంపై కొందరు ట్రోల్స్‌ చేస్తున్నారు.

రాజీవ్‌ తండ్రి చనిపోయిన సంవత్సరం కాకుండానే ఎలా శుభకార్యం చేస్తారు. అది కూడా ఒక గృహ ప్రవేశం ను ఎలా చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. తండ్రి చనిపోయినప్పుడు కనీసం సంవత్సరం పాటు శుభకార్యాలకు రాజీవ్‌ దూరంగా ఉండాలనే విషయం తెలియదా అంటూ నెటిజన్స్‌ ప్రశ్నిస్తున్నారు. మరి సుమ దంపతులు ఈ విషయాన్ని పట్టించుకుంటారా లేదా చూడాలి.