మహేష్ కోసం హాలీవుడ్ భామ..!

Thu Mar 16 2023 18:20:23 GMT+0530 (India Standard Time)

top hollywood actress in rajamouli mahesh film

RRR తో హాలీవుడ్ దర్శకుల పక్కన చేరిపోయాడు మన రాజమౌళి. ట్రిపుల్ ఆర్ సినిమాకు ప్రత్యేకంగా అవార్డ్ రాకపోయినా ఆ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి మాత్రమే అవార్డ్ వచ్చినా సరే ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళి ఇంటర్నేషనల్ లెవెల్లో భారీగా క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆర్.ఆర్.ఆర్ ఆస్కార్ దాకా వెళ్లగా ఇక తన నెక్స్ట్ సినిమా మరో రేంజ్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది. ముఖ్యంగా ట్రిపుల్ ఆర్ తో రాజమౌళి స్టామినా ఏంటో తెలిసిన హాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఆయనతో సినిమాకు రెడీ అంటున్నాయి.అంతేకాదు హాలీవుడ్ స్టార్స్ కూడా రాజమౌళి సినిమాలో నటించాలని చూస్తున్నారు. మహేష్ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ టాప్ యాక్ట్రెస్ ని తీసుకుంటారని టాక్. అదే జరిగితే మహేష్ రాజమౌళి చేసే సినిమా హాలీవుడ్ సినిమా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ సినిమాకు ఒక హాలీవుడ్ టీం ని సెట్ రైట్ చేశాడట రాజమౌళి. సిజి కోసం అక్కడ ఓ టీం తో డిస్కషన్స్ చేస్తున్నారట.

మహేష్ సినిమాను 500 కోట్లతో ప్లాన్ చేస్తున్న రాజమౌళి ఆ సినిమాతో మరోసారి ఆస్కార్ దాకా ఆ సినిమా ప్రభావం ఉండేలా చూస్తున్నారట. అదే జరిగితే మహేష్ వెరీ లక్కీ అని చెప్పొచ్చు. ఆర్.ఆర్.ఆర్ తో రాజమౌళికి వచ్చిన ఈ పాపులారిటీ అంతా కూడా మహేష్ సినిమాకు ప్లస్ అవుతుంది. 28వ సినిమా వరకు కేవలం తెలుగు సినిమాలనే చేస్తూ వచ్చిన మహేష్ ఒకేసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమాతో తన సత్తా చాటనున్నాడు.

మహేష్ రాజమౌళి ఈ కాంబో నిజంగానే అదిరిపోతుంది. సినిమా అంతా కూడా నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే కథ రెడీ చేయగా రాజమౌళి దీనిపై వర్క్ చేయాల్సి ఉంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం జూన్ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయని తెలుస్తుంది. మహేష్ 29 పాన్ వరల్డ్ సినిమాగా మరో ప్రభంజనానికి సిద్ధమయ్యాడు రాజమౌళి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.