Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ సినిమాతో ఆస్కార్… తమన్ కామెంట్

By:  Tupaki Desk   |   28 Jan 2023 8:00 AM GMT
త్రివిక్రమ్ సినిమాతో ఆస్కార్… తమన్ కామెంట్
X
ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇక హాలీవుడ్ ప్రముఖులని కూడా ఆర్ఆర్ఆర్ సినిమా మెప్పించింది. ఇక ఇప్పుడు నాటునాటు పాటతో ఆస్కార్ రేసులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆర్ఆర్ఆర్ మూవీ పోటీ పడుతుంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఈ సాంగ్ సొంతం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఆస్కార్ అవార్డుని కూడా నాటు నాటు సాంగ్ గెలుచుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఆస్కార్ ఎంట్రీలోకి ఆర్ఆర్ఆర్ మూవీ వెళ్ళడంతో మరోసారి దేశ వ్యాప్తంగా రాజమౌళి హాట్ టాపిక్ అయ్యారు.

ఇప్పుడు ఈ బజ్ సూపర్ స్టార్ తో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాకి కచ్చితంగా ప్లస్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పటికే సూపర్ స్టార్ తో చేయబోయే సినిమాని పాన్ వరల్డ్ లెవల్ లో తెరకెక్కించదానికి జక్కన్న ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆస్కార్ బరిలో నాటు నాటు సాంగ్ నిలబడిది ఇండియా నుంచి ఎఆర్ రెహమాన్ తర్వాత ఆస్కార్ సొంతం చేసుకున్న మ్యూజిక్ దర్శకుడిగా కీరవాణి నిలుస్తాడు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్ లో తమన్ కి జర్నలిస్ట్ నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ కి మార్గం వేసారు కదా, మరి మీరు ఎప్పుడు ఆస్కార్ పోటీలకి మీ సాంగ్స్ తో వెళ్తారు అని అడిగారు. దానికి తమన్ ఆసక్తికర సమాధానం చెప్పారు. త్రివిక్రమ్ తనని ఆస్కార్ కి తీసుకొని వెళ్తారని చెప్పాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాని దృష్టిలో ఉంచుకొని తమన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పటికే త్రివిక్రమ్, తమన్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురంలో మూవీ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే. అంతకు మించిన ఆల్బమ్ ఇప్పుడు సూపర్ స్టార్ మూవీకి అందించబోతున్నట్లు త్రివిక్రమ్ మాటలబట్టి తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.