Begin typing your search above and press return to search.

తమిళంలో సంక్రాంతి విన్నర్ వారసుడే

By:  Tupaki Desk   |   7 Feb 2023 8:00 AM GMT
తమిళంలో సంక్రాంతి విన్నర్ వారసుడే
X
ఈ ఏడాది సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగులో వాల్తేర్ వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలు ప్రేక్షకులు ముందుకు వచ్చాయి. ఇక వీటిలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య సంక్రాంతి ఫెస్టివల్ విన్నర్ గా నిలిచింది. చిరంజీవి కెరియర్ లోని హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది.

ఇక తమిళంలో ఇళయ దళపతి విజయ్ నటించిన వారిసు మూవీ, అజిత్ కుమార్ హీరోగా వచ్చిన తునివు సినిమాలు సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన వారసు మూవీ రిలీజ్ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. దీంతో ఈ సినిమా లాంగ్ రన్ లో ఏకంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక అజిత్ కుమార్ తునివు లాంగ్ రన్ లో ఇప్పటివరకు 194 కోట్ల గ్రాస్ ను మాత్రమే రాబట్టింది.

దీంతో ఈ రెండు సినిమాలలో ఇప్పుడు పొంగల్ విన్నర్ గా ఇళయ దళపతి విజయ్ వారిసు మూవీ నిలిచిందని చెప్పాలి. గత కొంతకాలంగా విజయ్ కెరియర్లో అన్ని బ్లాక్ బాస్టర్ హిట్స్ పడుతున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ చిత్రాలు మాత్రమే విజయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ప్రేక్షకుల ముందుకి రావడం విశేషం.

ఈ కారణంగానే కోలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎన్నడూ లేని విధంగా వారిసు సినిమాపై ఆసక్తి చూపించి థియేటర్స్ కు వచ్చారు. దీంతో లాంగ్ రాన్ లో ఈ సినిమా ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో అనే సినిమా చేస్తున్నాడు. లోకేష్ యూనివర్స్ లో భాగంగా ఈ మూవీ కూడా తెరకెక్కుతుందని తెలుస్తుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.