Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: జ‌ల్లెడ ఫ్రాకులో త‌నీషా వీకెండ్ వైబ్స్

By:  Tupaki Desk   |   20 Jun 2021 9:30 AM GMT
ఫోటో స్టోరి: జ‌ల్లెడ ఫ్రాకులో త‌నీషా వీకెండ్ వైబ్స్
X
రానా స‌ర‌స‌న అర‌ణ్య చిత్రంలో న‌టించింది త‌నీషా ముఖ‌ర్జీ. మోడ‌ల్ గా టీవీ రియాలిటీ క్వీన్ గా ఈ అమ్మ‌డికి సుదీర్ఘ అనుభ‌వం ఉంది. అటుపై బాలీవుడ్ వాట‌ర్ బేబీగా పాపుల‌రైంది. ఇక అర‌ణ్య‌తో సౌత్ ఆడియెన్ కి పరిచ‌య‌మైనా దుర‌దృష్ట‌వ‌శాత్తూ ఆ చిత్రం ఫ్లాపైంది.

త‌నీషా సోష‌ల్ మీడియా క్వీన్ గానూ సుప‌రిచితం. ఇన్ స్టాలో ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. నిరంత‌ర ఫోటోలు వీడియోలతో అభిమానుల్ని అల‌రిస్తున్నారు. తాజాగా త‌నీషా షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజా ఫోటోషూట్ లో జ‌ల్లెడ (మెస్సీ స్వెట్) ఫ్రాకును ధ‌రించి కెమెరాల‌కు ఫోజులిచ్చింది. ఆల్మోస్ట్ టాప్ లెస్ ఫోజులో అందాల‌ను ఆర‌బోసిన త‌నీషా యూత్ ని హీటెక్కిస్తోంది. పొట్టి ఫ్రాకులో థై సొగ‌సుల్ని ఎలివేట్ చేయ‌డం అగ్గి రాజేస్తోంది. ఇటీవ‌ల మాల్దీవుల విహారంలో బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్ తో ఆక‌ట్టుకున్న ఈ బ్యూటీ విల‌క్ష‌ణ‌మైన డిజైన‌ర్ దుస్తుల్లో క‌నిపించేందుకు ఆస‌క్తిగా ఉంటుంది.

త‌నీషా ట్రాక్ రికార్డ్ ని ప‌రిశీలిస్తే.. 2003 లో `ష్‌..` చిత్రంతో బాలీవుడ్ ‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ తరువాత ఆమె పాప్ ‌కార్న్ ఖావో! మస్త్ హో జావో- టాంగో చార్లీ - నీల్ ఎన్ నిక్కి తదితర చిత్రాల్లో న‌టించారు. బిగ్ బాస్ 7 .. ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 7 వంటి రియాలిటీ టీవీ షోలలో కూడా ఆమె పాల్గొంది. బండిష్- అనోఖా రిష్ట- జ్యువెల్ థీఫ్- జీన్ కి రాహ్- సుహాగన్- స్వర్గ్ నరక్ -అనుభవ్ వంటి క్లాసిక్స్ లోనూ న‌టించింది. తనీషా కాజోల్ కి సోద‌రి. తల్లి తనూజా ఒక ప్రముఖ నటి. ప్ర‌స్తుతం త‌నీషా సౌత్ లో నూ రాణించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌.