Begin typing your search above and press return to search.

తమన్నా హద్దులు దాటే సరసాలు?

By:  Tupaki Desk   |   16 March 2023 7:35 PM GMT
తమన్నా హద్దులు దాటే సరసాలు?
X
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నా నటిగా సుదీర్ఘ కెరియర్ ని కొనసాగించింది. స్టార్ హీరోయిన్ గా ఏకంగా 20 ఏళ్ళ నుంచి కొనసాగుతుంది. ఇప్పటికి ఆమె టాప్ స్టార్స్ లో ఒకరుగానే ఉంది. ప్రస్తుతం హీరోయిన్ గా తెలుగులో భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ కి జోడీగా జైలర్ సినిమాలో నటిస్తుంది. మరో వైపు వెబ్ సిరీస్ లలో కూడా ఈ బ్యూటీ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి రెండు వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో తమన్నా భాటియా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె డేట్ లో ఉందనే ప్రచారం నడుస్తుంది. రెగ్యులర్ గా తమన్నా బాలీవుడ్ నైట్ పార్టీలలో విజయ్ వర్మతో కలిసి కనిపిస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్ళిన కూడా అతనితోనే కలిసి వెళ్తుంది. ఈ నేపధ్యంలోనే విజయ్ వర్మతో తమన్నా పీకల్లోతు ప్రేమలో ఉందని బిటౌన్ టాక్.

అయితే దీనిపై ఇప్పటి వరకు వీరిద్దరూ క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య వేలంటైన్ డే సందర్భంగా విజయ్ వర్మ ఒక చెయ్యిని పోస్ట్ చేసి తన లవ్ ని తెలియజేశారు. ఆ చెయ్యి చూసిన తర్వాత అందరూ తమన్నా అని ఫిక్స్ అయ్యారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ కలిసి హిందీలో లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లో కలిసి నటిస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో తమన్న విజయ్ వర్మతో కలిసి డీప్ ఇంటిమేట్ సన్నివేశాలు, లిప్ లాక్ సీన్స్ చేసినట్లుగా ప్రచారం నడుస్తుంది.

తమన్నా కెరియర్ లో ఇప్పటి వరకు సినిమాలలో కూడా ఇంటిమేట్, కిస్ సన్నివేశాలలో నటించింది లేదు. అయితే మొదటి సారి వెబ్ సిరీస్ కోసం ఆమె బోల్డ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఒకే చెప్పిందనే మాట బిటౌన్ లో వినిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్ తో ఇంటిమేట్ సన్నివేశాలు కాబట్టి చేయడానికి ఆమె ఒకే చెప్పిందనే ప్రచారం నడుస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తమన్నా ఓపెన్ గా చెప్పడం, లేదంటే లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ టీజర్ వచ్చే వరకు తెలిసే అవకాశం లేదని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.