భర్త కొడుతున్నాడు.. విడిపోతున్నా-స్వాతి నాయుడు

Sun Aug 02 2020 07:00:03 GMT+0530 (IST)

swathi naidu ready to divorce

ఇంటర్నెట్లో శృంగార భరిత సినిమాలు చూసే వాళ్లకు స్వాతి నాయుడు గురించి కొత్త గా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. గతంలో సాఫ్ట్ పోర్న్ సినిమాలు చేసిన ఆమె.. తర్వాత పూర్తి స్థాయి పోర్న్ సినిమాల్లో నటించింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో విస్తృతంగా కనిపిస్తుంటాయి కూడా. ఐతే గత ఏడాది ఈ అమ్మాయి అవినాష్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది.వాళ్లిద్దరిదీ ప్రేమ పెళ్లి కావడం విశేషం. తన కుటుంబ సభ్యులు స్వాతి తో పెళ్లి ని నిరాకరించారని.. స్వాతి శృంగార చిత్రాల్లో నటించడం పట్ల తనకు అభ్యంతరం లేదని అవినాష్ చెప్పాడప్పుడు. ఈ మాత్రం అవగాహన మంచిదే అని అంతా అనుకున్నారు. కానీ వీళ్లిద్దరూ ఇప్పుడు విడిపోబోతున్నారట. అవినాష్ ద్వారా ఓ పాపను కూడా కన్న స్వాతి.. ఆ పాపను తనకే వదిలేసి తాను అతడికి దూరం కానున్నట్లు ఓ వీడియో ద్వారా వెల్లడించింది.

తమకు ఇటీవలే పాప పుట్టిందని.. తనకు అనారోగ్యంగా ఉంది.. ఆ టెన్షన్ లో ఉన్నానని.. తాము ఈ మధ్యే ఓ ఇల్లు కట్టడం మొదలు పెట్టామని.. ఐతే లాక్ డౌన్ వల్ల ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని.. ఇలాంటి సమయంలో తన భర్త రోజూ తాగి తనన కొడుతున్నాడని ఆమె అంది. చిన్న పాపతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని.. పాపను చూడమన్నా చూడటం లేదని... ప్రతి చిన్న విషయానికి కోప్పడుతున్నాడని.. చాలా గొడవలు అవుతున్నాయని.. ఏం చెప్పినా తాగుడు మానట్లదేని.. తనను పెళ్లి చేసుకుని నేను తప్పు చేశానని అనిపిస్తోందని.. తాను అతన్ని చేసుకోలేదు.. అతనే కావాలని ఇష్టపడి తనను చేసుకున్నాడని.. ఇప్పుడు నరకం చూపిస్తున్నాడని.. అందుకే పాపను కూడా తనకే వదిలేసి అతడి నుంచి విడి పోవాలని నిర్ణయించుకున్నానని స్వాతి చెప్పింది. ఐతే స్వాతి ఆరోపణలన్నీ నిజమా.. లేక వ్యూస్ కోసం ఇలా చేసిందా అని జనాలు సందేహిస్తున్నారు.