`అవును` పూర్ణ `సువర్ణ సుందరి`గా మెప్పిస్తుందా?

Mon Jan 23 2023 22:02:52 GMT+0530 (India Standard Time)

suvarna sundari poorna is ready for release

అల్లరి రవిబాబు `అవును` ఫ్రాంఛైజీ కథానాయికగా పూర్ణ పాపులరైంది. టాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ కన్నడ బ్యూటీ తెలుగు టీవీ చానెళ్లలో డ్యాన్స్ రియాలిటీ షోల జడ్జిగాను కనిపిస్తోంది.ఓవైపు సినిమాలు.. మరోవైపు బుల్లితెర ఇరు రంగాల్లోను రాణిస్తోంది. తాజాగా డాక్టర్ ఎమ్.వి.కె రెడ్డి సమర్పణలో ఎస్ టీమ్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న `సువర్ణసుందరి`లో కథానాయికగా నటిస్తోంది. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ చిత్రాన్ని ఎమ్.ఎల్. లక్ష్మీ నిర్మించారు. కరోనా ప్రభావంతో వాయిదా పడిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 3వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.  సీనియర్ నటి జయప్రద-- సాక్షి చౌదరి  ఈ చిత్రంలో ఇతర ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ..``సువర్ణ సుందరి రియన్ కార్నేనేషన్ సబ్జెక్ట్ రోలర్ కోస్టర్ స్క్రీన్ ప్లే తో మినిట్ బై మినిట్ ఆడియన్స్ కి మంచి థ్రిల్ ని ఇస్తుంది. కరోనా లో వాయిదా పడిన మా మూవీ రిలీజ్ కు ఇదే కరెక్టు టైమ్. ఇటీవల వచ్చిన బింబిసార- కార్తికేయ-2- మసూద లాంటి థ్రిల్లర్లకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు.

అలాంటి జానర్ లో వస్తున్న `సువర్ణ సుందరి` మూవీ కి కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. అలాగే సినీ సర్కార్ ఎంటర్ టైన్మెంట్స్ వీరబాబు మా `సువర్ణ సుందరి` మూవీ ని పెద్ద సినిమా స్థాయిలో ఫిబ్రవరి 3 నా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం`` అని అన్నారు
 
ఇంద్ర- రామ్- సాయికుమార్- కోట శ్రీనివాసరావు- నాగినిడు- అవినాష్-సత్యప్రకాశ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి  సంగీతం: సాయి కార్తీక్
సినిమాటోగ్రఫీ: యెల్లు మహంతి ఈశ్వర్...ఎడిటింగ్: ప్రవీణ్ పూడి.. సహ నిర్మాత: శ్రీకాంత్ పండుగల.. సమర్పణ:డాక్టర్ ఎమ్‌వికె రెడ్డి..నిర్మాత: ఎమ్.ఎల్. లక్ష్మీ.. రచనదర్శకత్వం: సురేంద్ర మాదారపు.