సుశాంత్ ఆ ప్రాజెక్ట్స్ కాదనకుంటే పరిస్థితి మరోలా ఉండేది

Sat Jul 11 2020 11:00:10 GMT+0530 (IST)

sushanth singh rejected these biggies in his career

బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ ఆత్మహత్య విషయం ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ఆయన గురించిన ఎదో ఒక విషయం సోషల్ మీడియాలో ప్రతి రోజు చర్చ జరుగుతోంది. కొన్ని సినిమాల నుండి సుశాంత్ ను తొలగించడం వల్లే ఆయన డిప్రెషన్ కు లోనై ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా కొందరు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలోనే సుశాంత్ తన చేతుల్లోకి వచ్చిన ప్రాజెక్ట్ లను వదిలేషినట్లుగా కూడా చెబుతున్నారు. సుశాంత్ వదిలేసిన పలు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఒకవేళ ఆ సినిమాలను సుశాంత్ చేసేందుకు ఒప్పుకుంటే ఖచ్చితంగా ప్రస్తుతం పరిస్థితి మరోలా ఉండేది అనేది కొందరి మాట.సుశాంత్ వద్దకు వచ్చిన ఆఫర్ల విషయానికి వస్తే సూపర్ హిట్ అయిన ఆషికి 2 మొదట ఈయన వద్దకే వచ్చిందట. ఆ సమయంలో ఉన్న కొన్ని పరిస్థితుల కారణంగా ఆ సినిమాను కాదన్నాడు. రామ్ లీలా సినిమాలో కూడా నటించే అవకాశం మొదట సుశాంత్ కె వచ్చింది. ఆ సమయంలో ఇతర ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అంటూ సుశాంత్ తప్పించుకున్నాడు. రెమో అక్బర్ వాల్తేర్ సినిమా కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ సినిమాలో కూడా మొదట సుశాంత్ ను అనుకున్నారు.

ఇలా కొన్ని మంచి సినిమాలను సుశాంత్ చేతులారా వదిలేశాడు. సుశాంత్ వదిలేసిన కొన్ని సినిమాలు నిరాశ కూడా పర్చాయి. సుశాంత్ హాఫ్ గర్ల్ ఫ్రెండ్ సినిమా మాత్రమే కన్ఫర్ అయిన తర్వాత మరొకరికి వెళ్ళింది. అంతకు మించి సుశాంత్ ఎక్కువ నష్టపోలేదని ఆయనే ఎక్కువ సినిమాలను వదిలేశాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.