'విక్రమ్'లో నాల్గవ హీరో కూడా ఉన్నాడట!

Thu May 12 2022 19:00:01 GMT+0530 (IST)

surya in kamal haasan vikram

యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమా జూన్ 3వ తారీకున విడుదల కాబోతుంది. కమల్ హాసన్ చాలా కాలం తర్వాత ఒక కమర్షియల్ బిగ్గెస్ట్ సక్సెస్ ను దక్కించుకోబోతున్నాడు అనే బలమైన నమ్మకంను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు లో కూడా ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి.లోకేష్ గత చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా కు సహజంగానే బజ్ క్రియేట్ అవుతు ఉంటుంది. కాని ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉంటుంది అనిపించడానికి కారణం తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి మరియు మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ లు కూడా నటించడం.

ముగ్గురు స్టార్ నటులు నటించిన సినిమా అవ్వడం వల్ల విక్రమ్ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఈ సమయంలో సినిమా లో మరో స్టార్ నటుడు కూడా కనిపించబోతున్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. తమిళ స్టార్ నటుడు సూర్య ను ఈ సినిమాలో కీలకమైన గెస్ట్ రోల్ లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ చూపించబోతున్నాడనే వార్తలు సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి.

లోకేష్ కనగరాజ్ పై ఉన్న నమ్మకంతో కమల్ హాసన్ ఈ సినిమా ను చేశాడు. పూర్తి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా కమల్ హాసన్ ఇమేజ్ కు తగ్గట్లుగా ఆయన అభిమానుల అభిరుచికి తగ్గట్లుగా రూపొందించాడనే నమ్మకం అందరిలో ఉంది. ఇప్పుడు సూర్య కూడా సినిమాలో కనిపించబోతున్నాడు అనే వార్తలు సినిమా స్థాయిని మరింతగా పెంచాయి అనడంలో సందేహం లేదు.

దర్శకుడు లోకేష్ కనగరాజ్ తదుపరి సినిమా కార్తీతో ఖైదీ కి సీక్వెల్ గా చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాలో కూడా సూర్య కీలక పాత్రలో కనిపిస్తాడనే వార్తలు వస్తున్నాయి. సూర్య పాత్ర విక్రమ్ సినిమాలో కంటే కాస్త ఎక్కువగానే ఖైదీ సీక్వెల్ లో ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి విక్రమ్ సినిమాలో నాల్గవ హీరో కూడా ఉన్నాడనే వార్తలతో సినిమా స్థాయి మరింతగా పెరగింది.